ఉత్తమ చిత్రంగా ‘జైభీమ్‌’

ABN , First Publish Date - 2022-05-04T09:25:45+05:30 IST

ఢిల్లీ వేదికగా గత నెల 30 నుంచి ప్రారంభమైన 12వ దాదాసాహెబ్‌ ఫాల్కే చిత్రోత్సవాల్లో సంగీత మేధావి ఇళయరాజాకు అవార్డు వరించింది.

ఉత్తమ చిత్రంగా ‘జైభీమ్‌’

దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇళయరాజాకు అవార్డు 

చెన్నై, మే 3(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ వేదికగా గత నెల 30 నుంచి ప్రారంభమైన  12వ దాదాసాహెబ్‌ ఫాల్కే చిత్రోత్సవాల్లో సంగీత మేధావి ఇళయరాజాకు అవార్డు వరించింది. అలాగే, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక.. ‘2డీ ఎంటర్‌టైన్మెంట్‌’ పతాకంపై నిర్మించిన ‘జైభీమ్‌’ లీగల్‌ డ్రామా ‘ఉత్తమ చిత్రం’గా ఎంపికైంది. ఇదే చిత్రంలో రాజాకన్ను పాత్రలో అద్భుతంగా నటించిన మణికంఠన్‌ ‘బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌’ అవార్డు వచ్చింది. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ‘ఎ బ్యూటిఫుల్‌ బ్రేకప్‌’ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డు లభించింది. ఇది ఇళయరాజా సంగీతం సమకూర్చిన 1422వ  చిత్రం కావడం గమనార్హం. 

Read more