ఆర్‌ఏఆర్‌ఎ్‌సకు బెస్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-01-22T07:01:02+05:30 IST

ఆర్‌ఏఆర్‌ఎ్‌సకి బెస్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ పురస్కారం లభించింది.

ఆర్‌ఏఆర్‌ఎ్‌సకు బెస్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ అవార్డు
అవార్డు అందుకుంటున్న ఏడీఆర్‌, శాస్త్రవేత్తలు

తిరుపతి(విద్య), జనవరి 21: తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాని(ఆర్‌ఏఆర్‌ఎ్‌స)కి బెస్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ పురస్కారం లభించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆరు ఏ-గ్రేడ్‌ పరిశోధనా స్థానాలు, 27 చిన్న పరిశోధన కేంద్రాలుండగా, పనితీరు ఆధారంగా తిరుపతి పరిశోధనా స్థానం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గుంటూరులోని లాంఫాంలో జరిగిన వర్సిటీ పరిశోధనా, విస్తరణ మండలి సమావేశంలో ఈ అవార్డును తిరుపతి కేంద్రం ఏడీఆర్‌ డాక్టర్‌ ప్రశాంతి, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్‌ పి.బాలహుస్సేన్‌రెడ్డి, డాక్టర్‌ నాగమాధురి, డాక్టర్‌ మదన్‌మోహన్‌లకు వీసీ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి, డీఆర్‌ డాక్టర్‌ త్రిమూర్తులు, విస్తరణ సంచాలకుడు డాక్టర్‌ రాంబాబు శుక్రవారం ప్రదానం చేశారు. 

Updated Date - 2022-01-22T07:01:02+05:30 IST