Asia Cup : ఆసియా కప్‌లో ఇరగదీశారుగా.. టోర్నీలో టీమిండియా ట్రాక్ రికార్డ్ ఇదీ..

ABN , First Publish Date - 2022-08-20T00:14:50+05:30 IST

మరో వారం రోజుల్లోనే ఆసియా కప్ టీ20(Asia Cup) సమరం ఆరంభమవనుంది. ప్రధాన జట్లు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) సహా ఇతర జట్లన్నీ ట్రోఫీని సొంతం చేసుకోవడంపై కన్నేశాయి.

Asia Cup : ఆసియా కప్‌లో ఇరగదీశారుగా.. టోర్నీలో టీమిండియా ట్రాక్ రికార్డ్ ఇదీ..

ముంబై : యూఏఈ వేదికగా మరో వారం రోజుల్లోనే ఆసియా కప్ టీ20(Asia Cup) సమరం ఆరంభమవనుంది. ప్రధాన జట్లు భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) సహా ఇతర జట్లన్నీ ట్రోఫీని సొంతం చేసుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నాయి. ఇందుకు సంబంధించి జట్లన్నీ ఇప్పటికే తమ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌(Asia cup)లో ఇప్పటివరకు ఉత్తమ ప్రదర్శన చేసిన జట్లు ఏవీ, భారత ట్రాక్ రికార్డ్ ఏవిధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం..


ఆసియా కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లలో టీమిండియా(Team India) అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 54 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 36 విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం తేలకపోగా.. అఫ్ఘనిస్తాన్‌పై మరో మ్యాచ్‌ టైగా ముగిసింది. చివరిసారి 2018 ఎడిషన్‌ భారత్ ఖాతాలోనే చేరింది. దీంతో మొత్తం 7 సార్లు ఆసియా కప్‌ను ఇండియా గెలిచినట్టయ్యింది. 


ఒకప్పుడు పటిష్టమైన టీమ్‌‌తో అదరగొట్టిన శ్రీలంకకు (Srilanka) కూడా ఆసియా కప్‌లో చక్కటి ట్రాక్ రికార్డ్ ఉంది. భారత్‌తో సమానంగా 54 మ్యాచ్‌లు ఆడగా అందులో 35 గెలుపులు ఉన్నాయి. భారత్ కంటే ఒక్క విజయమే శ్రీలంకకు తక్కువగా ఉంది. ఇక పాకిస్తాన్(Pakistan) మొత్తం 49 మ్యాచ్‌లు ఆడి 28 విజయాలు సాధించింది. 2000, 2012 ఎడిషన్లలో 2 సార్లు ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఇక ప్రస్తుత ఎడిషన్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజమ్ సారధ్యంలో పాక్ బరిలోకి దిగుతోంది.


ఆసియా కప్‌లో పాల్గొనే కీలకమైన జట్లలో బంగ్లాదేశ్‌(Bangladesh) ఒకటి. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 48 మ్యాచ్‌లు ఆడగా అందులో 10 విజయాలు సాధించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చివరి నాలుగు ఎడిషన్లలో 3 ఫైనల్స్ ఆడింది. ఈ సీజన్‌లో షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది.

Updated Date - 2022-08-20T00:14:50+05:30 IST