ప్రాథమిక స్థాయిలోనే మెరుగైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2021-07-27T04:28:43+05:30 IST

అంటువ్యాధులకు కారణమవుతున్న వైరస్‌లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వైద్యాధికారులను ఆదేశించారు.

ప్రాథమిక స్థాయిలోనే  మెరుగైన వైద్యం అందించాలి
ల్యాబ్‌ను ప్రారంభిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌

 వైద్యాధికారులకు మంత్రి పువ్వాడ ఆదేశం

 జిల్లా ఆస్పత్రిలో వైరాలజీ విభాగాన్ని ప్రారంభించిన మంత్రి

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై 26:  అంటువ్యాధులకు కారణమవుతున్న వైరస్‌లను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వ్యాధినిర్ధారణ ‘వైరాలజీ ల్యాబ్‌’ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరాలజీ ల్యాబ్‌లో అఽత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చిందన్నారు.  ఆటోమేటిక్‌ ఆర్‌ఎస్‌ ఎక్స్‌ ర్యాక్షన మెషిన, ఆర్టీపీసీఆర్‌ యాంప్లిఫికేషన పరికరాలు బయో సేఫ్టి క్యాబిన వంటి ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రతి రోజు 600 నుంచి 800 పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు చెప్పారు. దీనితో పాటు  కరోనా కట్టడికి ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేస్తారన్నారు. అత్యాధునికమైన ల్యాబ్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కోరారు. ఈ కార్యక్రమంలో  కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన బచ్చు విజయ్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మాలతి, జిల్లా ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ బి వెంకటేశ్వర్లు, డీఎస్వో డాక్టర్‌ రాజేష్‌, వైరాలజీ ల్యాబ్‌ పర్యవేక్షకుడు డాక్టర్‌ సందీప్‌, మైక్రోబయాలజిస్ట్‌ అశోక్‌రెడ్డి, వైద్యులు డాక్టర్‌ సైదులు, సురేష్‌, తో పాటు డైటీషియన మేరి, ల్యాబ్‌ టెక్నీషియన వీరయ్య, ఖాజాపాషా, వినయ్‌భాస్కర్‌, ఫార్మాసిస్టులు రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-07-27T04:28:43+05:30 IST