ముగ్గురు బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-10-27T10:12:22+05:30 IST

ముగ్గురు బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు

ముగ్గురు బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు

రూ. 14 వేలు, టీవీ, 10 ఫోన్లు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి): యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలపై బెట్టింగ్‌ దందా కొనసాగుతోంది. పోలీసులు అరెస్టు చేస్తున్నా బెట్టింగ్‌ రాయుళ్లు దందాను నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా ముగ్గురిని అరెస్టు చేయగా... ఒకరు పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు నగరంలో 150 మందికిపైగా బెట్టింగ్‌ రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు.   


మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన విజయ్‌సింగ్‌(31) వస్త్ర వ్యాపారం చేస్తూ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించడం ప్రారంభించాడు. అదే ప్రాంతానికి చెందిన ఆశి్‌షసింగ్‌(34)తో కలిసి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పరమేశ్‌సింగ్‌(32), విష్ణుసింగ్‌(40) వారికి సహకరిస్తున్నారు. ఆదివారం బడా బంగ్లాలో బెట్టింగ్‌  నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడిచేసి ముగ్గురిని పట్టుకున్నారు. విష్ణుసింగ్‌ పారిపోయాడు. వారి నుంచి రూ. 14 వేలు, టీవీ, మొత్తం 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను మంగళ్‌హాట్‌ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-10-27T10:12:22+05:30 IST