ఆన్‌లైన్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2020-10-17T07:32:26+05:30 IST

ఆన్‌లైన్‌ మోసాలపై జాగ్రత్తగా ఉం డాలని ఎస్పీ శ్వేతారెడ్డి సూచించారు. మద్నూర్‌ మండలానికి చెందిన ఒక మహిళ నూతన వస్త్రాలను

ఆన్‌లైన్‌ మోసాలపై జాగ్రత్తగా ఉండాలి

ఎస్పీ శ్వేతారెడ్డి


కామారెడ్డి, అక్టోబరు 16: ఆన్‌లైన్‌ మోసాలపై జాగ్రత్తగా ఉం డాలని ఎస్పీ శ్వేతారెడ్డి సూచించారు. మద్నూర్‌ మండలానికి చెందిన ఒక మహిళ నూతన వస్త్రాలను కొనుగోలు చేద్దామని ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయగా వస్త్రాలు చాలా రోజులు గడిచినప్పటి కీ రాకపోవడంతో కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేయగా.. అవతలి వ్యక్తి సైబర్‌ నేరస్థుడు అని పసిగట్టలేకపోయిన మహిళ అతను చెప్పి నట్లు క్విక్‌ సపోర్టు అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని బ్యాంక్‌ వివరాలను అప్లికేషన్‌లో పొందుపరిచారని తెలిపారు.


వెంటనే సదరు మహిళ బ్యాంక్‌ నుంచి రూ.42,500 కొల్లగొట్టడం జరిగిం దని తెలిపారు. మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసు లకు ఫిర్యాదు చేశారని తెలిపారు. రోజురోజుకూ ఆన్‌లైన్‌ మోసా లు పెరిగిపోతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలా గే గుర్తు తెలియని వ్యక్తులను నమ్మవద్దని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందిం చాలని ఆమె తెలిపారు.

Updated Date - 2020-10-17T07:32:26+05:30 IST