గిరిజనుల పాలిట శాపంగా మారిన అధికారుల అలసత్వం

ABN , First Publish Date - 2021-08-09T20:41:41+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో అధికారుల అలసత్వం గిరిజనుల పాలిట శాపంగా మారింది.

గిరిజనుల పాలిట శాపంగా మారిన అధికారుల అలసత్వం

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో అధికారుల అలసత్వం గిరిజనుల పాలిట శాపంగా మారింది. దుమ్ముగూడెం మండలంలో సింగువరం, లక్ష్మిపురం గ్రామాల మధ్య 2019లో కోటి రూపాయలతో లోలెవల్ బ్రిడ్జి నిర్మించారు. నిర్మాణం పూర్తయిన మూడు నెలలకే లోలెవల్ బ్రిడ్జి గోదావరి తాకిడికి పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి లేకపోవడంతో పక్కనే 2 కి.మీ. దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లి రావాలంటే చుట్టూ 15 కి.మీ. తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వరదల సమయంలో స్థానికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు.


పెద్దవాగు ప్రాంతంలో లోలెవల్ బ్రిడ్జిని నిర్మించినా వరద తాకిడికి ఉండదని స్థానికులు చెప్పినా ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోలేదు. పెద్దవాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తే సుమారు 20 గ్రామాలకు రవాణా సౌకర్యం ఉంటుందని, ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు తమ గ్రామాలను కలుపుతూ.. పెద్దవాగుమీద హైలెవల్ బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఐటీడీఏ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు.

Updated Date - 2021-08-09T20:41:41+05:30 IST