TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎల్‌జీ షోరూంలో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-09-03T14:33:32+05:30 IST

భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ఎల్‌జీ (LG) షో రూంలో శనివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది.

TS News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎల్‌జీ షోరూంలో అగ్నిప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District): భద్రాచలం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ఎల్‌జీ (LG) షో రూంలో శనివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. షో రూంలోని ఫ్రిజ్‌లు, ఎల్ఈడి టీవీలు, ఖరీదయిన వస్తువులు.. సుమారు రూ. 10 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-09-03T14:33:32+05:30 IST