వరద ప్రభావిత ప్రాంతాల్లో Governor-KCR పోటాపోటీ పర్యటన..

ABN , First Publish Date - 2022-07-17T16:49:38+05:30 IST

గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అటు సీఎం కేసీఆర్ , ఇటు గవర్నర్ తమిళి సై పర్యటించనున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో Governor-KCR పోటాపోటీ పర్యటన..

భద్రాద్రి (Bhadradri): గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో అటు సీఎం కేసీఆర్ (CM KCR), ఇటు గవర్నర్ తమిళి సై (Governor Tamili sai) పర్యటించనున్నారు. ఇద్దరూ పోటా పోటీ పర్యటనలకు వస్తుండడంతో అధికారుల్లో టెన్షన్ కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తమిళి సై పర్యటించనుండగా.. ఏటూరు నాగారంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.


గోదావరి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడుతోంది. ప్రధానంగా భద్రాచలం ముంపులో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్, ముఖ్యమంత్రి పోటా పోటీ పర్యటనలకు తెరతీశారు. ఈ పరిణామంపై అధికార యంత్రాంగంలో జోరుగా చర్చజరుగుతోంది. ముందుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని తమిళి సై నిర్ణయం తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం సికింద్రాబాద్ నుంచి రైలు మార్గంలో కొత్తగూడెం చేరుకుని గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. వరద బాధితులను పరామర్శించి, వరద సాయంపై ఆరా తీయనున్నారు. దీని కోసం ఆమె ఢిల్లీ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు.


సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి హెలీకాఫ్టర్‌లో భద్రాచలం వెళ్లాలని ముందుగా నిర్ణయించగా చివరి నిముషంలో దానిని మార్పు చేశారు. వరంగల్ నుంచి కారులోనే భద్రాద్రా చలం వెళ్లనున్నారు. కొత్తగూడెంలో హెలికాఫ్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం భద్రాచలంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలను సందర్శించనున్నారు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. ఉత్తర తెలంగాణలో ఎస్సార్ఎస్సీ, కడెం, కాళేశ్వరం తదితర వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు.

Updated Date - 2022-07-17T16:49:38+05:30 IST