Bhadrachalam దగ్గర Godavari ఉగ్రరూపం

ABN , First Publish Date - 2022-07-15T14:05:14+05:30 IST

భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది.

Bhadrachalam దగ్గర Godavari ఉగ్రరూపం

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem): భద్రాచలం (Bhadrachalam) వద్ద  గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం 66.7 అడుగులకు చేరి.. 21,76,101 క్యూసెక్కులుగా ఉంది. 2006 నాటి వరద రికార్డ్ 66.9ను అధిగమించింది. 70 అడుగులు దాటే అవకాశంముంది. దీంతో అధికారులు గోదావరి వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. 36 ఏళ్ల తర్వాత వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. 1986 నాటి జలప్రళయం పునరావృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆనాటి జలప్రళయం చేదు జ్ఞాపకాలు ఇంకా భద్రాద్రి వాసులు మర్చిపోలేదు.


కాగా గోదావరి జల ప్రళయానికి అడ్డుకట్టగా నిలిచి.. శ్రీ రామరక్షగా కరకట్ట మారింది. రాజమండ్రి దవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. మరికొద్ది సేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. 17.20 అడుగులకు నీటిమట్టం పెరిగింది. దీంతో అధికారులు 18.21 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు.

Updated Date - 2022-07-15T14:05:14+05:30 IST