
భద్రాద్రి కొత్తగూడెం: శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు సీతారాముల దర్శనానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భారీగా తరలిరావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయంలో తీర్థప్రసాదాలను అధికారులు నిలిపివేశారు. రూ.100 దర్శనానికి ప్రత్యేకంగా అధికారులు రెండు క్యూలైన్లను అధికారులు ఏర్పాటు చేశారు.