చుక్క నీరందించని మిషన్‌ భగీరథ

ABN , First Publish Date - 2022-05-09T04:24:53+05:30 IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పలు గ్రామాల్లో చుక్క నీరు అందించడం లేదు. ప్రతి గ్రామంలో లక్షల రూపా యలు వెచ్చించి భగీరథ ట్యాంకులు నిర్మించి గాలికి వదిలేశారు. మండ లంలోని ఇటిక్యాలపహాడ్‌లో రెండు సంవత్సరాల క్రితం మిషన్‌ భీరథ పథకం కింద రూ.14 లక్షలతో వాటర్‌ ట్యాంకు నిర్మించారు.

చుక్క నీరందించని మిషన్‌ భగీరథ
ఇటిక్యాల గ్రామం

- చేద బావులు, బోరింగ్‌ నీటిని తాగుతున్న ప్రజలు

- పట్టించుకోని అధికారులు

సిర్పూర్‌(టి), మే 8: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం పలు గ్రామాల్లో చుక్క నీరు అందించడం లేదు. ప్రతి గ్రామంలో లక్షల రూపా యలు వెచ్చించి భగీరథ ట్యాంకులు నిర్మించి గాలికి వదిలేశారు. మండ లంలోని ఇటిక్యాలపహాడ్‌లో రెండు సంవత్సరాల క్రితం మిషన్‌ భీరథ పథకం కింద రూ.14 లక్షలతో వాటర్‌ ట్యాంకు నిర్మించారు. కానీ దీని ద్వారా నేటికీ నీరు సరఫరా చేయడం లేదు. సదరు కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి బిల్లులు పొందాడు. ప్రజలు చేసేది లేక గ్రామాల్లో ఉన్న చేదబావులు, వాగులు, వంకలు, పురాతన ఆర్‌డబ్ల్యూఎస్‌ బోర్ల నీటిని తాగుతు న్నారు. వర్షాకాలంలో ఈ నీరు కలుషితమై అతిసారా, డయేరియా, విషజ్వరాల బారిన పడుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామానికి మిషన్‌ భగీరథ నీరు సరఫరా చేయాలని సమీక్షా సమావేశాలు పెట్టినా ఫలితం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వర్షాకాలం వరకైనా మిషన్‌ భగీరథ నీరు అందంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు

- దేవిచందర్‌, సర్పంచ్‌, ఇటిక్యాల

మిషన్‌ భగీరథ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మా గ్రామంలో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం చేపట్టి రెండు సంవత్సరాలైంది. దానికి నేటికీ మిషన్‌ భగీరథ కనెక్షన్‌ ఇవ్వలేదు. ఇళ్ల నల్లాలు బిగించ లేదు. నేటికీ నీటిని సరఫరా చేయడం లేదు. 

Read more