నేటి నుంచి ‘భగీరథ’ నీటి సరఫరా

ABN , First Publish Date - 2021-04-23T06:01:25+05:30 IST

జిల్లాలో మిషన్‌భగీరథ నీటి సరఫరా శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని, అధికారుల నుంచి అదేశాలు వ చ్చేంత వరకు నీటిని తాగడానికి వినియోగించకూడదని, ఇతర అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు.

నేటి నుంచి ‘భగీరథ’ నీటి సరఫరా
మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌

- కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ 

- ట్రయల్‌ రన్‌ పరిశీలన 

సిరిసిల్ల, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మిషన్‌భగీరథ నీటి సరఫరా శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని, అధికారుల నుంచి అదేశాలు వ చ్చేంత వరకు నీటిని తాగడానికి వినియోగించకూడదని, ఇతర అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. గురువారం మిషన్‌భగీరథ నీటి సరఫరా ట్రయల్‌ రన్‌ను పరిశీలించారు. అగ్రహారం ఇం టెక్‌వెల్‌ శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. మిషన్‌భగీరథ తాగునీటి సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాజరాజేశ్వర మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం తగ్గడం వల్ల గత నెల 30 నుంచి జిల్లా లో మిషన్‌భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యను క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించారన్నారు. ట్ర యల్‌ రన్‌ విజయవంతం అయ్యిందని, మిషన్‌భగీరథ నీటి సరఫరా పక్రియ శుక్రవారం నుంచి పునః ప్రారంభం అవుతుందన్నారు. నీటి నమునాను పరీక్ష ల కోసం ల్యాబ్‌కు పంపిస్తామన్నారు. అధికారులు ఆదేశాలు జారీచేసిన తరు వాతనే తాగడానికి ఉపయోగించుకోవాలని, అప్పటి వరకు నీటిని ఇతర అవ సరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని  సూచించారు. మిడ్‌ మానేరు పైపులైన్‌ ద్వారా నీటి సరఫరాలో అక్సిజన్‌ స్థాయిని కూడా పెంచడం కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయన వెంట మిషన్‌భగీరథ సీఈ శ్రీనివాసరా వు, ఎస్‌ఈ రవీందర్‌, ఈఈ విజయ్‌కుమార్‌, డీఈ నవీన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-23T06:01:25+05:30 IST