లోక్‌సభ ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా

ABN , First Publish Date - 2022-03-14T20:59:21+05:30 IST

పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ఈనెల16న ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్ తన ఎంపీ పదవికి..

లోక్‌సభ ఎంపీ పదవికి భగవంత్ మాన్ రాజీనామా

న్యూఢిల్లీ: పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ఈనెల16న ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్ తన ఎంపీ పదవికి సోమవారంనాడు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. సంగ్రూగ్ నుంచి లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఆయన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందటం, పార్టీ సీఎం అభ్యర్థిగా ఆయనను ఎన్నికలకు ముందే 'ఆప్' ప్రకటించడం, ఈ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్‌సభకు తాను దూరమవుతున్నట్టు  చెప్పారు. ''ఏళ్ల తరబడి తనను ఎంతగానో అభిమానించిన సంగ్రూర్ ప్రజలకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు పంజాబ్ ప్రజలు నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. వారందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. త్వరలోనే మళ్లీ సంగ్రూర్ ప్రజల వాణి లోక్‌సభలో వినిపిస్తుంది''  అని అన్నారు.

Updated Date - 2022-03-14T20:59:21+05:30 IST