భక్తజన సంద్రం

ABN , First Publish Date - 2021-03-01T04:36:35+05:30 IST

మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఆదివారం తెల్లవారుజామున కన్నుల పండువగా సాగింది.

భక్తజన సంద్రం
రథాన్ని లాగుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

కనుల పండువగా మన్యంకొండ రథోత్సవం

తెల్లవారుజామున 3 గంటలకు కదిలిన తేరు

హారతి ఇచ్చి ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణ తిరుపతిగా పేరొచ్చేలా అభివృద్ధి చేస్తామని వెల్లడి


మహబూబ్‌నగర్‌/మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 28: మన్యంకొండ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఆదివారం తెల్లవారుజామున కన్నుల పండువగా సాగింది. వేడుకను తిలకించేందుకు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి తరలొచ్చిన అశేష భక్తజనంతో తేరుమైదానం కిక్కిరిసింది. శనివారం ఉదయం నుంచే ఆలయం జనంతో రద్దీగా మారింది. గరుడ వాహన సేవ, రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జామున 3 గంటలకు జరిగిన రథోత్సవంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.ఽశ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొని, తేరును లాగారు. ప్రత్యేక పూజ లు నిర్వహించారు. భక్తులకు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. మన్యంకొండలో వెలిసిన వేంక టేశ్వరస్వామికి గొప్ప చరిత్ర ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కృష్ణానది జలాలను గుట్టపైకి తీసుకొచ్చి రోజూ ఆ జలాలతోనే స్వామివారికి అభిషేకం చేయడం గొప్ప విషయ మన్నారు. తీరితే తిరుపతి తీర కుంటే మన్యంకొండ అనే నానుడి ఉందన్నారు. ఇక్కడికి జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటా రన్నారు. తెలంగాణ వచ్చిన ఈ ఆరేళ్లలో ఆలయాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. వివాహాలు జరుపుకునేందుకు కల్యాణ మండపం ఏర్పాటు చేశామన్నారు. గుట్టపైకి రెండో వైపున ఘాట్‌ రోడ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 800 ఏళ్ల కిందట మునుల కొండగా పిలువబడే ఈ మన్యంకొండకు ఎంతో విశిష్ఠత ఉందన్నారు. భక్తులు గుట్టపై ఉండేలా గదులను కూడా నిర్మిస్తున్నామన్నారు. యాదాద్రి, వేములవాడ రాజన్న, సమ్మక్క సారక్కలతోపాటు దక్షిణ తెలంగాణలోని మన్యంకొండ దేవాలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. తెలంగాణ తిరుపతిగా పేరొచ్చేలా, నిరంతరం దైవ ప్రార్థనలతో తిరుపతి మాదిరిగా ఇక్కడి కొండలు వేంకటేశ్వరస్వామి నామస్మరణతో మారు మ్రోగేలా చేస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని భగవంతుడు చల్లగా చూడాలని, నిత్యం పాడిపంటలతో కళకళలాడేలా ఆశీర్వదిం చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని నర్సింహులు, కోరమోని వెంకటయ్య, చెరుకుపల్లి రాజే శ్వర్‌, రాజేశ్వర్‌రెడ్డి, తాటి గణేష్‌, తిరుపతిరెడ్డి, కె.ఆంజనేయులు పాల్గొన్నారు. 













Updated Date - 2021-03-01T04:36:35+05:30 IST