భక్తిశ్రద్ధలతో హనుమాన జయంతి!

ABN , First Publish Date - 2022-05-26T05:17:31+05:30 IST

హనుమాన జయంతి సందర్భంగా బుధవారం నీరుగట్టు వారిపల్లె మారుతీనగర్‌లోని ప్రసన్న ఆంజనే యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించా రు. హనుమాన చాలీసా పారాయణం చేశారు

భక్తిశ్రద్ధలతో హనుమాన జయంతి!
తమలపాకుల అలంకారంలో అభయాంజనేయస్వామి

మదనపల్లె అర్బన, మే 25: హనుమాన జయంతి  సందర్భంగా బుధవారం నీరుగట్టు వారిపల్లె మారుతీనగర్‌లోని ప్రసన్న ఆంజనే యస్వామి ఆలయంలో పూజలు నిర్వహించా రు. హనుమాన చాలీసా పారాయణం చేశారు. కురబ కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్‌ దండు రామాజులు, తొగటవీర క్షత్రియసంఘం పట్టణ అఽధ్యక్షుడు ఉప్పురామచంద్ర, కౌన్సిలర్లు ఎస్వీ రమణ, శివయ్య, మందపల్లె వెంకటరమణ, చేనేత నంఘం నాయకులు రామ్మోహన, మనో హర్‌, పాల్గొన్నారు.  ఆలయకమిటీ గౌరవాధ్య క్షులు లక్ష్మీనారాయణ, రామచంద్ర, అధ్యక్షుడు కొరమట్ట శ్రీనివాసులు, సభ్యులు సత్యనారా యణ, పురాణంరత్నాలు, పురాణం రమణ, బండి నాగరాజ, అంగడి రాజా పర్యవేక్షించారు.  చౌడేశ్వరీ సర్కిల్‌లోని అభయాంజ నేయస్వామి ఆలయంలో ధర్మకర్త శ్రీనివాసులు, ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. వరాల ఆంజనేయస్వామి ఆలయాన్ని అరటి స్థంబాలతో అలంకరించారు. పుంగనూరు రోడ్డు, అప్పారావువీధి,. సీటీఎంలోని ఆలయల్లో పూజలు, భజనలు చేశారు. దాదాపుగా అన్ని ఆలయాల్లో అన్నదానం చేశారు.

పెద్దతిప్పసముద్రం: కందుకూరులో నూత నంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయం లో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభి షేకాలు, పూజలు నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పుష్పపల్లకిపై ఊరేగించారు. పోలేపల్లె కుటుంబ సభ్యులు, బాగేపల్లె ఈశ్వర్‌ రెడ్డి కుటుంబ సభ్యులు, యాదాళం ప్రభాకర్‌ నరసింహులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వాల్మీకిపురం: పట్టణ పడమర పొలిమేరల్లోని ధర్మపథం ఆభయ ఆంజనేయస్వామి ఆలయం లో అభిషేకం, అర్చన, ఆకుపూజ, సింధూర పూజ, వడమాలసేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సీతారాముల కల్యాణం చేశారు. సాయంత్రం ఆంజనేయుడికి గ్రామోత్సవం నిర్వహించారు.. అర్చకుడు సాలిగ్రామ శ్రీనివా సాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.

గుర్రంకొండ: హనుమాన జయంతి సంద ర్భంగా తరిగొండ బాటవీరాంజనేయస్వామి ఆలయం, అమిలేపల్లె ఆంజనేయస్వామి ఆల యం, గుర్రంకొండ ఓనిలోని అభయ ఆంజనేయస్వామి ఆలయాల్లో  వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చనలు, ఆకు పూజలు, అనంతరం అన్నదానం చేశారు. 

ములకలచెరువు: పెద్దపాళ్యం, ములకల చె రువులోని వీరాంజనేయ స్వామి ఆలయాలు, వేపూరికోటలోని ఆవధూత ఆదినారాయణ స్వా మి ఆశ్రమంలో పూజలు నిర్వ హించారు.

కలకడ: బాటవారిపల్లెలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో వేకువజామునే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూ జలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రసాదాలను పంపి ణీ చేశారు.

పెద్దమండ్యం:  ౅పెద్దమండ్యం, వెలిగల్లు, బిక్కావాండ్లపల్లి, పాపేపల్లి, కొలిమికాడపల్లి, సి. గొల్లపల్లి, ముసలికుంట, మందలవారిపల్లి గ్రామాల్లో హనుమాన జయంతి సందర్భంగా పూజలు, అన్నదానం చేశారు. 


Updated Date - 2022-05-26T05:17:31+05:30 IST