భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST

గురుపౌర్ణమి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహిం చారు. నెహ్రూ బజార్‌లోని షిరిడీ సాయి మందిరంలో బాబా మూలవిరాట్‌కు ప్రత్యేక అలంక రణ, అభిషేకాలు చేశారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
ప్రత్యేక అలంకరణలో సాయినాథుడు

మార్కాపురం (వన్‌టౌన్‌), జూలై 24 : గురుపౌర్ణమి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో శనివారం నిర్వహిం చారు. నెహ్రూ బజార్‌లోని షిరిడీ సాయి మందిరంలో బాబా మూలవిరాట్‌కు ప్రత్యేక అలంక రణ, అభిషేకాలు చేశారు. సాయి జీవిత చరిత్ర  పారాయణం నిర్వ హించారు. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, పలువురు ప్రముఖులు బాబాను దర్శించుకున్నారు. మందిర అధ్యక్ష, కార్యదర్శులు పేరం సత్యనారాయణ, గోపాలుని హరి హరరావు, కమిటీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వ హించారు. స్థానిక జగదాంబ సమేత మార్కం డేశ్వరస్వామి ఆలయంలో  జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహానికి ప్రత్యేక పూజలు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు సోమయాజుల హరిప్రసాద్‌ శర్మ, రుత్వికులు రెంటచింతల తేజశర్మ, రవికుమార్‌ శర్మ, ఈదర పవ న్‌శర్మ ప్రసాద్‌శర్మ, ఏలూరి రేవంత్‌శర్మ ఆధ్వర్యంలో వివి ధ కార్యక్రమాలు నిర్వహించారు.

పెద్దారవీడు(మార్కాపురం) : మండలంలోని చట్ల మిట్ట బాబా మండపంలో శనివారం ప్రత్యేక పూ జలు నిర్వహించారు. సాయినాథునికి అభిషేకాలు నిర్వ హించారు. 

పొదిలిలో..

పొదిలి :  పొదిలిలో ఉన్న సాయిబాబా మందిరాలు శనివారం భక్తులతో కిటకిటలాడాయి. దర్శి రోడ్డులోని సాయిబాబా మందిరంలో వందలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తూరిలోని  బాబా మందిరం, వీరభద్రస్వామి దేవాలయం, సాయిబాబా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో మాజీ  ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. 

తర్లుపాడులో..

తర్లుపాడు : తర్లుపాడులోని బా బా మందిరంలో  అర్చకులు అలు గు గురుబ్రహ్మం సాయికి పూజలు నిర్వహించగా, ఆలయ ధర్మకర్త మాదాల మల్లికార్జున్‌ భక్తులకు ఎ లాంటి అసౌకర్యాలు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  తహ సీల్దార్‌ శైలేంద్రకుమార్‌, మాజీ స ర్పంచ్‌ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, ప లువురు అధికా రులు, ప్రజా ప్రతినిధులు బాబాను దర్శించు కున్నారు. రాత్రికి బాబా పల్లకి సేవ నిర్వహించారు. 

గిద్దలూరులో..

గిద్దలూరు టౌన్‌ : గురుపౌర్ణమి సందర్భంగా శనివారం పట్టణంలోని సాయిబాబా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని బద్వేలు రోడ్డు, రాచర్ల రోడ్డులోని బాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.  మిగతా ఆలయాల్లో కూడా  గురుపౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. 

కంభంలో..

కంభం : కంభం, అర్థవీడు మండలాల్లో శనివారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కంభం పట్టణంలోని సాయిబాబా గుడిలో, తెలుగువీధి రంగరాజు పాఠశాల సమీపంలోని సాయిబాబా మందిరంలో పూజలు అనంతరం అన్నదానం నిర్వహించారు. 

బి.పేటలో..

బేస్తవారపేట : దరగా కొండపై  ఉన్న సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమిని నిర్వహించారు. బేస్తవారపేట, దరగా, పాపాయిపల్లె, సోమవారపేట, నేకునాంబాద్‌ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

వై.పాలెంలో..

ఎర్రగొండపాలెం :   గరుపౌర్ణమి సందర్భంగా భక్తులు సాయి సత్యవ్రతాన్ని ఆచరించారు. అనంతరం అ న్నదానం నిర్వహించారు.  సాయిబాబా భక్తసేవా సంఘం సేవాకార్యక్రమాలు నిర్వహించారు.  

త్రిపురాంతకంలో..

త్రిపురాంతకం: : స్థానిక ఎన్నెస్పీ కాలనీలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించా రు. ఈసందర్బంగా ఆలయ కమిటీ  ఆధ్వర్యంలో  ప్రత్యే క పూజలు, అనంతరం అన్నదానం నిర్వహించారు.  అ లాగే బాలాత్రిపుర సుందరీదేవి ఆలయంలో ప్రధానార్చకులు పాలంక ప్రసాదశర్మ సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.ప్ర సాదరావు,  పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. 

పెద్దదోర్నాలలో..

పెద్ద దోర్నాల :  సాయిబాబ దేవాలయంలో ప్రజలు గురుపౌర్ణమి  భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.  అర్చకులు రామయ్య గురూజీ సాయిబాబకు ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.




Updated Date - 2021-07-24T05:30:00+05:30 IST