గంగిరెద్దు ప్రదర్శనను తిలకిస్తున్న ఎంపీ, వీసీ తదితరులు
- రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్
- నన్నయ వర్శిటీలో జాతీయ సంస్కృతి మహోత్సవం
దివాన్‌చెరువు, మార్చి 27: అవినీతి రహిత సమాజంగా ఉన్నప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎదుర్కొనేశక్తి ఏ దేశానికి లేదని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌కుమార్ అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాల యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, నన్నయ వర్శిటీ సంయు క్తంగా నిర్వహించిన జాతీయ సంస్కృతి మహోత్సవ సభను వీసీ జగన్నాథరావు, సాహిత్య ప్రముఖులు జ్యోతి వెలిగించి ఆదివారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని అప్పుడే సమాజంలో మార్పులు వస్తాయని అన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ భారత సంస్కృ తిని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత నేటితరాలకు ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంగ్ల భాష అవసరమే కానీ మాతృభాషను మరచిపోకూడదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచ దేశాలకు భారత్ తలమానికమైనదని చెప్పారు. వీసీ జగన్నాథరావు మాట్లాడు తూ ఉభయగోదావరి జిల్లాల సంస్కృతి చాలా విశేషమైనదని చెప్పారు. అత్యం త ప్రాచీన కాలంలోనే మనకు తెలుగులో మౌఖిక సాహిత్యం ఉందని, లిఖిత సాహిత్యానికి మాత్రం నన్నయ రచించిన మహాభారతం మొదటి ఆధారమని చెప్పారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అమిత్ప్రసాద్శార్భాయ్, డైరెక్టర్ పి.దీపిక మన సంస్కృతిని మనం పరిరక్షిం చుకుంటూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎర్రాప్రగడ రామకృష్ణ రచించిన గోదావరి గలగలలు పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో శలాకరఘనాథశర్మ, ఆచార్య పర్వతనేని సుబ్బారావు, రెంటాల శ్రీవేంకటేశ్వర రావు వివిధ అంశాలపై మాట్లాడారు. అనంతరం వివిధ పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులను వీసీ అందజేశారు. కార్యక్రమంలో రాజమహేంద్ర వరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్, ఓఎస్డీ ఆచార్య ఎస్.టేకి, అధ్యాపకులు పాల్గొన్నారు.