Bharat Jodo Yatra: సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-24T16:51:48+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర శనివారం

Bharat Jodo Yatra: సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర శనివారం పునఃప్రారంభమైంది. శుక్రవారం విరామం తీసుకున్న తర్వాత శనివారం ఉదయం ‘భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra)ను ఆయన ప్రారంభించారు. ఈ యాత్ర కర్ణాటకలో ప్రవేశించిన తర్వాత ఏదో ఓ చోట పాల్గొనాలని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi), ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) నిర్ణయించారు. 


కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (D K Shivakumar) శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. ఈ యాత్ర ఈ నెల 30న కర్ణాటకలో ప్రవేశిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని వివరాలను వెల్లడిస్తారు. సోనియా, ప్రియాంక పాల్గొంటారనే సమాచారాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కూడా ధ్రువీకరించారు. కర్ణాటక కాంగ్రెస్ యూనిట్ చేసిన ఏర్పాట్ల పట్ల ఏఐసీసీ (AICC) సంతృప్తి వ్యక్తం చేసింది. 


వేణుగోపాల్ మాట్లాడుతూ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఈ యాత్రలో ఏదో ఒక రోజు పాల్గొంటారని చెప్పారు. వీరిద్దరూ వేర్వేరుగా ఈ యాత్రలో పాల్గొంటారన్నారు. సెప్టెంబరు 7న ప్రారంభమైన ఈ యాత్రకు అనూహ్య స్పందన వస్తోందని చెప్పారు. 


17వ రోజుకు భారత్ జోడో యాత్ర

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్ర 17వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. 12 కిలోమీటర్ల యాత్ర అనంతరం కేరళలోని  అంబల్లూరు కూడలి (Amballur Junction) వద్ద నేతలు, కార్యకర్తలు విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు టాలోర్ బైపాస్ జంక్షన్ (Talore Bypass Junction) వద్ద యాత్ర పునఃప్రారంభమవుతుంది. త్రిసూర్ వడక్కుమ్నాథన్ దేవాలయానికి చేరుకుంటారు. 


ఈ యాత్రకు త్రిసూర్ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని కాంగ్రెస్ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ (Jairam Ramesh)  ఇచ్చిన ట్వీట్‌లో, ఓ రోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత 17వ రోజు భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం 6.35 గంటలకు పెరంబ్ర జంక్షన్ నుంచి  ప్రారంభమైందని తెలిపారు. ఈ యాత్రలో పాల్గొంటున్నవారి కోసం, సేవాదళ్ సభ్యుల కోసం శుక్రవారం చలకుడి వద్ద ఓ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 





Updated Date - 2022-09-24T16:51:48+05:30 IST