Navy: భారత్‌-అమెరికా నావికాదళాల సంయుక్త విన్యాసాలు

ABN , First Publish Date - 2022-09-20T16:30:24+05:30 IST

భారత్‌-అమెరికా దేశాల నావికాదళ సంయుక్త విన్యాసాలు సోమవారం జరిగాయి. అమెరికా నావికాదళానికి చెందిన ‘మిడ్‌జెట్‌’ యుద్ధ నౌక నాలుగు రోజు

Navy: భారత్‌-అమెరికా నావికాదళాల సంయుక్త విన్యాసాలు

వేళచ్చేరి(చెన్నై), సెప్టెంబరు 19: భారత్‌-అమెరికా దేశాల నావికాదళ సంయుక్త విన్యాసాలు సోమవారం జరిగాయి. అమెరికా నావికాదళానికి చెందిన ‘మిడ్‌జెట్‌’ యుద్ధ నౌక నాలుగు రోజుల విన్యాసాలకు ఇటీవల చెన్నై హార్బర్‌కు వచ్చింది. చెన్నై సముద్రతీరంలో ఇరుదేశాల నావికాదళాలు ‘అభ్యాస్‌-01/22’ పేరిట సంయుక్త విన్యాసాలు జరిపాయి. సరిహద్దులో తీవ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడం, ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడం వంటి విన్యాసాలను రెండు దళాలు ప్రదర్శించాయి. ఈ పర్యటనలో భాగంగా అమెరికా-భారత్‌(America-India) నావికాదళ సిబ్బంది వాలీబాల్‌ ఆడినట్లు భారత నావికాదళం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-09-20T16:30:24+05:30 IST