అసంఘటిత కార్మికులకు భరోసా ఈ-శ్రమ్‌ కార్డు

Published: Tue, 05 Jul 2022 23:50:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అసంఘటిత కార్మికులకు భరోసా ఈ-శ్రమ్‌ కార్డుఈ-శ్రమ్‌ కార్డును అందజేస్తున్న రోజాశర్మ

జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

సిద్దిపేట అగ్రికల్చర్‌, జూలై 5: అసంఘటిత కార్మికులకు భరోసా ఈ-శ్రమ్‌ కార్డు అని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని టీటీసీ భవన్‌లో కార్మికశాఖ, నేషనల్‌ యాక్టివ్‌ రిపోర్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ-శ్రమ్‌ పథకంపై అవగాహన, ఉచిత నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ-శ్రమ్‌ కార్డు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు గొప్ప వరమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ మహేందర్‌, జిల్లా పంచాయతీరాజ్‌శాఖ అధికారి దేవకీదేవి, సిద్దిపేట మెప్మా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హన్మంతరెడ్డి పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.