ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా అక్షయ మౌనిక

ABN , First Publish Date - 2022-01-22T05:08:16+05:30 IST

చెస్‌లో ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా భాష్యం విద్యార్థిని బొమ్మినేని అక్షయ మౌనిక ఘనత సాధించినట్లు సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు.

ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా అక్షయ మౌనిక
మౌనికను అభినందిస్తున్న భాష్యం రామకృష్ణ

గుంటూరు(విద్య), జనవరి 21: చెస్‌లో ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా భాష్యం విద్యార్థిని బొమ్మినేని అక్షయ మౌనిక ఘనత సాధించినట్లు   సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ తెలిపారు. స్థానిక చంద్రమౌళినగర్‌ మెయన్‌ క్యాంపస్‌లో విద్యార్థినిని శుక్రవారం ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 4 నుంచి 9 వరకు స్పెయిన్‌లో జరిగిన 33వ రోక్వెటాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో మౌనిక పాల్గొని ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ టైటిల్‌ సొంతం చేసుకుందున్నారు. ఈ టోర్నీకి ముందు మొదటి విమ్‌నామ్‌ (ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌), 2019 జనవరిలో ఢిల్లీలో ఇంటర్నేషనల్‌ ఓపెన్‌లో జరిగిన టోర్నమెంట్‌ సాధించినట్లు తెలిపారు. రెండో సారి 2021లో హంగేరిలోని బుడాపేస్ట్‌లో జరిగిన పోటీల్లో టైటిల్‌ సాఽధించినట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్‌ జూనియర్స్‌ బాలికల ఛాంపియన్‌షిప్‌ 2019లో క్యాంసం, వరల్డ్‌ యూత్‌ 18 బాలికల ఆన్‌లైన్‌ గ్రాండ్‌ప్రిక్స్‌ సిరిస్‌ 2021లో రెండో స్థానం సాధించిందన్నారు. శ్రీలంకలో జరిగిన ఆసియా యూత్‌ అండర్‌ 16లో 2019లో టీమ్‌ గోల్డ్‌, వ్యక్తిగతంగా ఏడో స్థానం సాఽధించినట్లు తెలిపారు.  

 

Updated Date - 2022-01-22T05:08:16+05:30 IST