కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులకు శాపం: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-04-14T00:13:58+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టతలేని విధానాలే రైతులకు శాపంగా మారాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులకు శాపం: భట్టి విక్రమార్క

ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టతలేని విధానాలే రైతులకు శాపంగా మారాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరి సాగుకు దూరమైన రైతులందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంజాబ్‌, హర్యానా మాదిరిగానే రాష్ట్రంలో కూడా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. విద్యుత్‌ బిల్లులకు సంబంధించి డెవలప్‌మెంట్‌ చార్జీలను విపరీతంగా పెంచడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పెంచిన అదనపు చార్జీలను ఉప సంహరించుకోవాలని లేదంటే ప్రజల భాగస్వామ్యంతో ఐక్య ఉద్యమాలు చేస్తామని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

Updated Date - 2022-04-14T00:13:58+05:30 IST