భయాన్ని పోగొట్టి..ధైర్యాన్ని నింపి..!

ABN , First Publish Date - 2021-06-22T06:56:21+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడిలో గ్రామీణ వైద్యుల పాత్ర అత్యంత కీలక మారింది. వ్యాధి ఆరంభ దశ నుంచే వీరు సమర్ధవంతంగా విధు లు నిర్వర్తిస్తూ వ్యాధి కట్టడి చేయడంతోపాటు ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు.

భయాన్ని పోగొట్టి..ధైర్యాన్ని నింపి..!
డాక్టర్‌ షేక్‌ ఖాజానాయబ్‌ రసూల్‌


కరోనా కట్టడిపై వైద్య దంపతులు యుద్ధం 

77 గ్రామాల్లో ప్రజలకు అవగాహన

వ్యాక్సినేషన్‌లో ముందంజ

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 21 : కరోనా వైరస్‌ కట్టడిలో గ్రామీణ వైద్యుల పాత్ర అత్యంత కీలక మారింది. వ్యాధి ఆరంభ దశ నుంచే వీరు సమర్ధవంతంగా విధు లు నిర్వర్తిస్తూ వ్యాధి కట్టడి చేయడంతోపాటు ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ భయం, ఆందోళనతో బయటకు రాని ప్రజలను సైతం గుర్తించి వారికి మనో ధైర్యం నింపి వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలను నిలబెడతున్నారు ఇద్దర డాక్టర్లు. వారిద్దరూ దంపతులు కావడం విశేషం. గ్రామీణ ప్రాం తాల్లో వైద్యాధికారులు రోగ లక్షణాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరాలు, చికిత్స, వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా వా టిని అధిగమించి  కొవిడ్‌ నియంత్రణకు కృషి చేస్తున్నారు. గిద్దలూరు మండలంలో కెఎ్‌సపల్లి, సంజీవరాయునిపేట ప్రాంతాలలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఈ రెండు ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 77 గ్రామాల ప్రజలకు ఆ వైద్య దంపతులు విశే ష సేవలందిస్తున్నారు. నిత్యం ప్ర జలతో మమేకమవుతూ కరోనాపై యుద్ధం చేస్తున్నారు.    

ప్రతి పంచాయతీలోనూ టీకాలు వేశాం

వ్యాక్సిన్‌ వేయించుకుంటే జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులతో చివరికి చనిపోతామన్న అపోహ ప్రజల్లో ఉండేది. మొదట్లో టీకా వేయించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వైద్య సిబ్బంది సహకారంతో ప్రజలకు  టీకాపై అవగాహన కల్పించాం. ఇప్పటికే 11,500 మందికి టీకా వేసే కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అంతేకాకుండా మొదట్లో మండల టీకా కేంద్రం, తరువాత సచివాలయ స్థాయి, ఆ తరువాత మేజర్‌ పంచాయతీ, ప్రస్తుతం ప్ర తి పంచాయతీలోనూ పెద్ద ఎత్తున టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ము ఖ్యంగా గ్రామాలలో  కరోనా నివారణ పరీక్షలు నిర్వహించి వైరస్‌పై ప్రజల్లో భయాన్ని తొలగించాం. ప్రజలందరూ ప్రభుత్వం అందచేసే టీకా వేయించుకుంటే మరణాల శాతం తగ్గడానికి వీలు కలుగుతుంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు వినియోగించేలా అవగాహన కల్పించాం.

-  డాక్టర్‌ షేక్‌ ఖాజానాయబ్‌ రసూల్‌

కెఎ్‌సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గిద్దలూరు

అవగాహనతోనే 

కట్టడి సాధ్యం

సంజీవరాయునిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 35 గ్రామాలు ఉన్నాయి. మొదట్లో టీకా వే యించుకోవాలని ఇంటింటికీ తిరిగి ప్రజలకు కోరినా వారు స్పందించలేదు. ఇప్పుడు టీకా వేయించుకోవడానికి  స్వచ్ఛందంగా వారే ముందుకు వస్తున్నారు. గ్రామాల్లో జ్వరాల సర్వే వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఆరా తీస్తున్నా రు. బాధితులను తీవ్రత బట్టి హోం ఐసోలేషన్‌ లే దా చికిత్స కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాం. కరోనాపై విస్తృతమైన అవగాహన కార్యక్ర మాలు చేపట్టాం. దీంతో గ్రామాల్లో వైరస్‌ కట్టడి సాధ్యమైంది. కేసుల వేగం తగ్గుతోంది. కట్టడిని స వాలుగా తీసుకుని ప్రజలకు చికిత్స నిర్వహించాం. వారిలో ఉన్న భయాన్ని దూరం చేశాం.  

-  డాక్టర్‌ సుమయా, 

సంజీవరాయునిపేట 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గిద్దలూరు






Updated Date - 2021-06-22T06:56:21+05:30 IST