భీమడోలులో ఆలస్యంగా వెలుగులోకి లంచావతారం

Published: Mon, 27 Jun 2022 20:41:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భీమడోలులో ఆలస్యంగా వెలుగులోకి లంచావతారం

ఏలూరు (Eluru): భీమడోలు (Bheemadolu)కి చెందిన ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నారు. భీమడోలు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ గుప్తా (Ramesh Gupta).. ఓ వ్యక్తి వద్ద పన్నెండు వేలు లంచం (Bribe) తీసుకున్నాడు. అది సాక్షాత్తు సచివాలయ ప్రాంగణంలోనే జరిగింది. కొన్ని కాంట్రాక్ట్ పనుల బిల్లులు సకాలంలో చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శి రమేష్‎కు సదరు వ్యక్తి లంచం ఇచ్చారు. అయితే ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శి రమేష్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 


ఇక ఈ లంచం బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రమేష్ గుప్తా లంచం తీసుకున్న వీడియో (Video) సోషల్ మీడియా (Social Media)లో వైరల్‎గా మారింది. అయితే లంచం వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.