యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘భీమ్లా నాయక్’.. తొలి వీకెండ్‌లోనే ఎంత రాబట్టిందంటే..

ABN , First Publish Date - 2022-02-28T17:27:43+05:30 IST

పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే హిట్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీ

యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘భీమ్లా నాయక్’.. తొలి వీకెండ్‌లోనే ఎంత రాబట్టిందంటే..

ఓవర్సీస్ సినిమా: పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే హిట్ టాక్ సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ.. ఒక్క అమెరికాలోనే 400 థియేటర్లలో విడులైంది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరక్కిన ఈ సినిమా అగ్రరాజ్యంలో పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో తొలి వీకెండ్‌లోనే 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.15కోట్లు) వసూలు చేసింది. అమెరికాలో ‘భీమ్లా నాయక్’‌ను విడుదల చేసిన ప్రైమ్ మీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కూడా ఇదే దూకుడు కొనసాగితే.. అమెరికాలో ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 



ఇదిలా ఉంటే..భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా యాక్ట్ చేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'భీమ్లా నాయక్' చిత్రంతో పవర్ స్టార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-02-28T17:27:43+05:30 IST