భీమ్లా నాయక్: విడుదలకు ముందే Americaలో కలెక్షన్ల సునామీ

ABN , First Publish Date - 2022-02-19T18:26:50+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భీమా నాయక్ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 25న రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించేసింది. ఈ క్రమంలో విడుదలకు

భీమ్లా నాయక్: విడుదలకు ముందే Americaలో కలెక్షన్ల సునామీ

ఓవర్సీస్ సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భీమా నాయక్ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 25న రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించేసింది. ఈ క్రమంలో విడుదలకు ముందే ‘భీమ్లా నాయక్’ అగ్రరాజ్యం అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో నాలుగు వందలకుపైగా థియేటర్లలో ఈ మూవీ విడుదల కాబోతున్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడిచారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం.. థియేటర్ల జాబితాను విడుదల చేసింది. ఆయా.. థియేటర్లు ఫిబ్రవరి 24న ప్రీమియర్ షోలు వేయనున్నాయి. దీంతో ఇప్పటికే ప్రీబుక్సింగ్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే ‘భీమ్లా నాయక్’ అమెరికాలో లక్ష డాలర్లకుపైగా.. అంటే దాదాపు రూ.75లక్షల వరకూ వసూలు చేసింది. ఈ విషయాన్ని అమెరికాలో ‘భ్లీమా నాయక్’ను విడుదల చేస్తున్న ప్రైమ్ మీడియా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.


భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా యాక్ట్ చేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' చిత్రంతో పవర్ స్టార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అని ఇప్పటికే అభిమానులు ప్రచారం చేస్తున్న విషయం తెలసిందే.






Updated Date - 2022-02-19T18:26:50+05:30 IST