భేన్‌ కి కబాబ్‌

ABN , First Publish Date - 2021-02-22T23:12:29+05:30 IST

తామర కాడలు - రెండు పెద్దవి, సెనగపప్పు - ఒక కప్పు, యాలకులు - కొన్ని, అల్లం ముక్క - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు,

భేన్‌ కి కబాబ్‌

కావలసినవి: తామర కాడలు - రెండు పెద్దవి, సెనగపప్పు - ఒక కప్పు, యాలకులు - కొన్ని, అల్లం ముక్క - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, నూనె - సరిపడా, కొత్తిమీర - ఒకకట్ట, ఉల్లిపాయలు - కొద్దిగా (గార్నిష్‌ కోసం)


తయారీ విధానం: ఒక పాత్రలో తామర కాడలు, సెనగపప్పు, యాలకులు, అల్లం, వెల్లులి రెబ్బలు వేసి, ఒక కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికిన తరువాత స్టవ్‌ పైనుంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పేస్టులా పట్టుకోవాలి. తరువాత అందులో తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి వడల మాదిరిగా ఒత్తుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక కబాబ్స్‌ వేసి గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. ఉల్లిపాయలతో గార్నిష్‌ చేసి, గ్రీన్‌ చట్నీతో వడ్డించాలి.


Updated Date - 2021-02-22T23:12:29+05:30 IST