పన్ను వసూళ్లలో ‘భువనగిరి’ ముందంజ

ABN , First Publish Date - 2022-06-30T06:31:55+05:30 IST

ట్రేడ్‌ లైసెన్స, పెండింగ్‌ నీటి చార్జీల వసూళ్లలో భువనగిరి మునిసిపాలిటీ దూసుకెళ్తోంది.

పన్ను వసూళ్లలో ‘భువనగిరి’ ముందంజ

 ట్రేడ్‌ లైసెన్స, నీటి బకాయి వసూళ్లపై సత్ఫలితాన్నిస్తున్న స్పెషల్‌డ్రైవ్‌

  మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం నేడు

 భువనగిరి టౌన, జూన 29: ట్రేడ్‌ లైసెన్స, పెండింగ్‌ నీటి చార్జీల వసూళ్లలో భువనగిరి మునిసిపాలిటీ దూసుకెళ్తోంది. ఊహించని స్థాయి లో వసూలవుతుండడంతో మునిసిపల్‌ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతోంది. ఆనలైన ట్రేడ్‌ లైసెన్స వసూళ్లు, జారీ, రెన్యువల్స్‌లో రాష్ట్రంలోనే భువనగిరి మునిసిపాలిటీ గత నెల రోజులుగా ముందంజలో కొనసాగుతోంది. ఈ మేరకు మంగళవారం వరకు ట్రేడ్‌ లైసెన్సల పేరిట రూ.90.13లక్షలు వసూలయ్యాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న రూ.3.49 కోట్ల వసూళ్లకు చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో మొదటి రెండు రోజుల్లోనే రూ.2.71లక్షలు వసూలయ్యాయి. అలాగే భువనగిరి పట్టణ ప్రధాన రహదారి వంద ఫీట్ల విస్తరణ రహదారి పనుల్లో భాగంగా స్థానిక వినాయక చౌరస్తా వద్ద రెండు భవనాలను బుధవారం తొలగించారు.  వంద ఫీట్ల మార్కింగ్‌ ఆధారంగా భవనాలను తొలగించుకోవాలని గతంలోనే మునిసిపాలిటీ నోటీసులు ఇచ్చినప్పటికీ యజమానులు స్పందించకపోవడంతో కమిషనర్‌ బి.నాగిరెడ్డి నేతృత్వంలో పోలీస్‌ బందోబస్తు నడుమ ఆ రెండు భవనాలను మార్కింగ్‌కు  అనుగుణంగా  తొలగించారు. ఈ సందర్బంగా భవన యజమానులు మునిసిపల్‌ సిబ్బందితో తీవ్రస్థాయిలో వాగ్వాదం చేయడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ తొలగించారు.  కాగా మునిసిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం గురువారం జరుగనుంది. 13 ఎజెండా అంశాలతో చైర్మన ఎనబోయిన అంజనేయులు అధ్యక్షతన ఉదయం 11గంటలకు కౌన్సిల్‌ హాల్‌లో సమావేశం నిర్వహించనున్నారు. 


Updated Date - 2022-06-30T06:31:55+05:30 IST