మినీ మహానాడు స్థలానికి భూమి పూజ

ABN , First Publish Date - 2022-07-01T04:51:17+05:30 IST

మదనపల్లెలో జూలై 6వ తేదీ నిర్వహించనున్న మినీమహానాడు సభాస్థలం చదును పనులకు మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు.

మినీ మహానాడు స్థలానికి భూమి పూజ
మినీమహానాడు స్థలానికి భూమి పూజ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి, టీడీపీ నాయకులు

సర్వమత ప్రార్థనలు చేసిన టీడీపీ నాయకులు

మదనపల్లె టౌన్‌ / క్రైం, జూన్‌ 30: మదనపల్లెలో జూలై 6వ తేదీ నిర్వహించనున్న మినీమహానాడు సభాస్థలం చదును పనులకు మదనపల్లె టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. గురువారం స్థానిక బైపా్‌స రోడ్డు పక్కన ఉన్న 10 ఎకరాల ప్రైవేటు స్థలంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ గురువులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి మాట్లాడుతూ బైపాస్‌ రోడ్డులోని మినీమహానాడు స్థలం అటు తంబళ్లపల్లె, ఇటు పుంగనూరు, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లె నుంచి వచ్చే టీడీపీ కార్యకర్తలకు అనువుగా ఉందన్నారు. కార్యక్రమంలో రాటకొండ సోమశేఖర్‌, సాయిచిత్ర భాస్కర్‌, ఎస్‌ఎల్‌వీ రఘు, భవానీప్రసాద్‌, వల్లిగట్ల వెంకటరమణ, యశశ్విరాజ్‌, చాణుక్యతేజ, తాజ్‌బాషా, నిస్సార్‌అహ్మద్‌, నిరంజన్‌ నాని, ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.


మినీ మహానాడుకు భద్రత కట్టుదిట్టం

మినీ మహానాడు బందోబస్తు ఏర్పాట్లను ఏఎస్పీ రాజ్‌కమల్‌ పరిశీలించారు. గురువారం ఆయన మైదానాన్ని పరిశీలించి సిబ్బందితో చర్చించారు. అనంతరం టీడీపీ నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మినీ మహానాడుకు భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు రవిమనోహరాచారి, కేశప్ప, సీఐలు ఈదురుబాషా, మురళీకృష్ణ, సత్యనారాయణ, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T04:51:17+05:30 IST