గ్రామీణ రహదారులకు మహర్దశ

ABN , First Publish Date - 2022-06-27T05:30:00+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత గ్రామీణ ప్రాంత రహదారులకు మహర్దశ లభించిందని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

గ్రామీణ రహదారులకు మహర్దశ
రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహాం

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ

మానవపాడు, జూన్‌ 27 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తర్వాత గ్రామీణ ప్రాంత రహదారులకు మహర్దశ లభించిందని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. మండలంలో 44వ నంబరు జాతీయ రహదారి నుంచి బోరవెల్లి మీదుగా పల్లెపాడు వరకు ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ.1.50 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు పనులకు సోమవారం ఆమె అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాంతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ గ్రామీణ ప్రాంతాల ప్రజల కు రవాణా సదుపాయం కల్పించేందుకు గాను కోట్ల రూపాయలతో బీటీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు మార్గం సరిగ్గా ఉంటే గ్రామాలకు అన్ని రకాల వాహనాల రాకపోకలకు వీలుంటుం దని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలని ఆయన గుత్తేదారుకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచు విజయ లక్ష్మీ, ఎంపీటీసీ సభ్యురాలు ఈదమ్మ, మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, నాయకులు రాజశేఖర్‌, వెంక టేష్‌, సత్యం, దామోదర్‌రెడ్డి, నరసింహ్మ, రమేష్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T05:30:00+05:30 IST