భూబాగోతాలు సీబీఐకి అప్పగించాలి : బీజేపీ

ABN , First Publish Date - 2022-09-27T03:21:14+05:30 IST

రాపూరు మండలంలో భూ భాగోతాలు సీబీఐకి అప్పగిస్తేనే నిజాలు వెలుగుచూస్తాయని వెంకటగిరి నియోజవకర్గ బీజేపీ ఇన్‌చా

భూబాగోతాలు సీబీఐకి అప్పగించాలి : బీజేపీ
రెవెన్యూ కార్యాలయం ఎదుట ఽధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

రాపూరు, సెప్టెంబరు 26: రాపూరు మండలంలో భూ భాగోతాలు సీబీఐకి అప్పగిస్తేనే నిజాలు  వెలుగుచూస్తాయని వెంకటగిరి నియోజవకర్గ బీజేపీ ఇన్‌చార్జి ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు అన్నారు. రాపూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట కార్యకర్తలతో కలిసి సోమవారం ఆయన ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దారు పద్మావతికి  వినతిపత్రం అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పంగిలి, రావిగుంటపల్లి, పులిగిలపాడు గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు లేకపోవడంతో ఆందోళన కలిగిస్తుందన్నారు. మండలంలోని అన్నీ గ్రామాలకు రికార్డులు ఉండి, ఆ మూడు గ్రామాలతోపాటు మరో రెండు గ్రామాలకు రికార్డులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, భూస్వాములు, అధికారులు కుమ్ముక్కై ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, రికార్డులు లేకుండా చేశారన్నారు.  పేదలకు భూములను పంపిణీ చేసేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పెంచలయ్య, గోపాల్‌, ప్రతాప్‌, బాబులు, సుబ్రహ్మణ్యం, జయసింహ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-27T03:21:14+05:30 IST