ఆగస్టు 13న ఓటీటీలో 'భుజ్‌' విడుదల

Jul 7 2021 @ 12:59PM

ఆగస్టు 13న ఓటీటీలో 'భుజ్‌' విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. అభిషేక్‌ దుదయా దర్శకత్వంలో అజయ్‌దేవ్‌గణ్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌గా నటించిన మూవీ 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా'. సంజయ్‌దత్, సోనాక్షి సిన్హా, శరద్‌ ఖేల్‌కర్, యమ్మీ విర్క్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆగస్టు 13న 'భుజ్‌' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఓ వీడియో ద్వారా అజయ్‌దేవ్‌గణ్‌ తెలిపారు. "1971లో జరిగిన గొప్ప యుద్ధం 'భుజ్‌'గా ఆగస్టు 13న మీ ముందుకొస్తుంది"అని ట్వీట్‌ చేశారు. కాగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.