మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం

ABN , First Publish Date - 2021-03-01T05:55:37+05:30 IST

వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
మాట్లాడుతున్న భూమా అఖిలప్రియ

  1. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ


శిరివెళ్ల, ఫిబ్రవరి 28: వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.  మండలంలోని మోత్కలపల్లె గ్రామానికి ఆమె ఆదివారం వచ్చారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భూమా అభిమానులు పెద్దఎత్తున హాజరై భూమా అఖిలప్రియను గజమాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై విరక్తి చెందిన ప్రజల్లో మార్పు కనిపిస్తోందన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల కంటే గడిచిన సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగిందన్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం సత్తా చాటుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడమే తప్ప గ్రామాలను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యం వైసీపీ ప్రభుత్వానికి లేవన్నారు. దీంతో ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లలేక ప్రత్యర్థులను బెదిరించి, దౌర్జన్యాలకు దిగి బరిలో ఉన్న అభ్యర్థులను బలవంతంగా విత్‌డ్రా చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. నియోజకవర్గంలో సర్పంచ్‌ ఎన్నికల్లో 74 గ్రామ పంచాయతీల్లో 24 గ్రామాల్లో టీడీపీ బలపరిచిని అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాధించడం మంచి పరిణామమన్నారు. ఆళ్లగడ్డలో ప్రతి పనికి ఓటు రేటు కట్టి డబ్బు రాజకీయాలు చేస్తున్నారన్నారు. సర్పంచ్‌ వేణుగోపాల్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మురళి, మోత్కలపల్లె గ్రామ సర్పంచ్‌ భూమా వేణుగోపాల్‌రెడ్డి, టీడీపీ నాయకులు పాలూరి శివరామిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, మార్తల నాగిరెడ్డి, చిన్న ఈశ్వరరెడ్డి, పుల్లారెడ్డి, నాగేంద్రారెడ్డి, చిన్న వెంకటసుబ్బయ్య, బాలయ్య, శాంతయ్య, రాయప్ప, బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, యామా గుర్రప్ప, బాలచంద్రుడు, రామస్వామి, కమతం లక్ష్మిరెడ్డి, పుల్లారెడ్డి, జయరామిరెడ్డి, శీలం లక్ష్మీ ప్రసాద్‌, జనార్ధన్‌రెడ్డి, మహేష్‌, రామనాగిరెడ్డి, విజయ భాస్కర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, లక్ష్మిరెడ్డి, రామ్మోహన్‌, విజయ్‌, చిన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. 


‘అందుబాటులో ఉంటా’


రుద్రవరం: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి అండగా ఉంటానని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు. ఎల్లవేలలా అందుబాటులో ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. 


బాలిరెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ 

మండలంలోని నల్లవాగుపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సింగం బాలిరెడ్డి కుటుంబ సభ్యులను భూమా అఖిలప్రియ పరామర్శించారు. ఫిబ్రవరి 25న టీడీపీ నాయకుడు శీలం బాలిరెడ్డి అనా రోగ్యానికి గురై మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. పార్థసారధిరెడ్డి, గోపాల్‌రెడ్డి, శివరామిరెడ్డి  పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-01T05:55:37+05:30 IST