TS News: మావోయిస్టుల అలజడి

ABN , First Publish Date - 2022-09-03T03:36:11+05:30 IST

మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైంది. ఇన్‌ఫార్మర్ల పేరుతో హత్యలు, నేతలకు హెచ్చరికలతో ఉత్తర తెలంగాణ ఉలిక్కి పడుతోంది.

TS News: మావోయిస్టుల అలజడి

భూపాలపల్లి: మావోయిస్టుల అలజడి మళ్లీ మొదలైంది. ఇన్‌ఫార్మర్ల పేరుతో హత్యలు, నేతలకు హెచ్చరికలతో ఉత్తర తెలంగాణ ఉలిక్కి పడుతోంది. ప్రజాసమస్యలపై మావోయిస్టులు దృష్టి సారించి ప్రకటనలు చేస్తోండటం, బాధ్యులను హెచ్చరిస్తోండటంతో ఉద్రిక్తత నెలకొంటోంది. దీనికి తోడు అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు రెక్కి నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల ఫొటోలతో ఉన్న కరపత్రాలను పంపిణి చేస్తూ, పట్టించిన వారికి భారీగా నజరాలను పోలీసులు ఆఫర్‌ చేస్తున్నారు. వీరాపూర్‌ అడవుల్లో ఫ్లీనరీని భగ్నం చేసినా.. నక్సల్స్‌కు నష్టం చేకూరకపోవటంపై పోలీసుల్లో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడే కీలకమైన సమాచారం లభించటంతో మావోయిస్టులు బలపడక ముందే దెబ్బకొట్టాలనే వ్యూహం తో పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లుగా సమాచారం.   


ఇటీవల కాలంలో మావోయిస్టులు ఉత్తర తెలంగాణలో తమ కార్యకలాపాలను పెంచతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చాలాకాలం తరువాత తెలంగాణలో పార్టీ కీలక నేతలు సంచరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. గతనెల 19వ తేదీన ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్‌ అడవుల్లో మావోయిస్టులు భారీ ఫ్లీనరీగా ప్లాన్‌ చేయగా, పోలీసులు భగ్నం చేశారు. ఈ ప్లీనరీలో ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు సంబంధించి తొమ్మిది డివిజన్‌, ఏరియా కమిటీల బాధ్యులు పాల్గొననున్నారని సమాచారం.

Updated Date - 2022-09-03T03:36:11+05:30 IST