స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు భూత్పూర్‌

ABN , First Publish Date - 2022-09-25T05:37:00+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డుకు భూత్పూర్‌ మునిసిపాలిటీ ఎంపికైనట్లుగా మునిసిపల్‌ కమిషనర్‌ నూరుల్‌ నజీబ్‌ తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు భూత్పూర్‌
మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ను అభినందిస్తున్న సీఐ రజితారెడ్డి, స్థానిక నాయకులు

- మునిసిపల్‌ చైర్మన్‌ను అభినందించిన సీఐ

భూత్పూర్‌, సెప్టెంబరు 24 : కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డుకు భూత్పూర్‌ మునిసిపాలిటీ ఎంపికైనట్లుగా మునిసిపల్‌ కమిషనర్‌ నూరుల్‌ నజీబ్‌ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు అందినట్లుగా ఆయన విలేకులకు వివరించారు. మునిసి పాలిటీ అయిన రెండేళ్లకే కేంద్ర స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర పతి చేతులమీదుగా అక్టోబరు 1వ తేదీన అవార్డు అందుకోనున్నట్లు  తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి సహకారంతో సాధ్యమైందని అన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బస్వరాజుగౌడ్‌ను ఫోన్‌లో అభినందించారు. స్థానిక సీఐ రజితారెడ్డి కార్యాలయానికి చేరుకొని చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ను శాలువా, పూలమాలతో ప్రత్యేకంగా సన్మానించారు. స్థానిక నాయకులు చైర్మన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, ముడా డైరెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, మత్స్య సహకార సంఘం జిల్లా పర్సన్‌ ఇన్‌చార్జి సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, నా యకులు నారాయణగౌడ్‌, మేకల సత్యనారాయణ, అశోక్‌గౌడ్‌, బోరింగ్‌ నర్సిములు, గిరిజన సంఘం నాయకులు మాన్య నాయక్‌, రామునాయక్‌, గోపాల్‌ నాయక్‌, శ్రీను నాయక్‌, నాయకులు, మునిసిపాలిటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:37:00+05:30 IST