ఢిల్లీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

ABN , First Publish Date - 2022-08-24T16:48:38+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Senior Congress leader Bhuvanagiri MP Komati Reddy Venkat Reddy) వ్యవహారంపై తెలంగాణ

ఢిల్లీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Senior Congress leader Bhuvanagiri MP Komati Reddy Venkat Reddy) వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్‎లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇదీ ఇలా వుేండగా.. అధిష్టానం నుంచి కోమటిరెడ్డికి పిలుపు వచ్చింది. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే ఢిల్లీలో బట్టి విక్రమార్క, శ్రీధర్‎బాబు(Batti Vikramarka, Sridhar Babu) రెండు రోజుల క్రితం ఢిల్లీలో మకాం వేశారు. అయితే.. మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ లేదా సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-08-24T16:48:38+05:30 IST