భువనగిరి మునిసిపల్‌ కార్యాలయంలో తాగునీటికి కటకట

ABN , First Publish Date - 2022-06-28T06:21:23+05:30 IST

జిల్లా కేంద్రం భు వనగిరి మునిసిపల్‌ కార్యాలయంలో తాగునీటి కటక ట నెలకొన్నది.

భువనగిరి మునిసిపల్‌ కార్యాలయంలో తాగునీటికి కటకట

పట్టణంలో 70వేల మంది జనాభాకు తాగునీరు

కార్యాలయంలో  గుక్కెడు నీళ్లు కరువే.. 

సందర్శకులు హోటల్స్‌ను ఆశ్రయించాల్సిందే

ఇబ్బంది పడుతున్న సిబ్బంది..ప్రజలు

భువనగిరి టౌన, జూన 27: జిల్లా కేంద్రం భు వనగిరి మునిసిపల్‌ కార్యాలయంలో తాగునీటి కటక ట నెలకొన్నది. పట్టణంలోని 70 వేల మంది  ప్రజల దాహార్తిని తీరుస్తున్న మునిసిపల్‌ యంత్రాంగం. అయినా కార్యాలయంలోనే తాగేందుకు గుక్క నీటి చు క్క కరువైంది. దీంతో కార్యాలయ సిబ్బంది, పాలకులు, పనుల నిమిత్తం వచ్చే సందర్శకులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మునిసిపల్‌ కార్యాలయానికి వెళ్తున్నామంటే తాగునీటిని వెంట తీసుకెళుతున్నారు. తాగునీటిని వెంట తెచ్చుకోని వారు దప్పికను తట్టుకోలేకపోతే సమీపంలోని హోటళ్లకు వెళుతున్నారు. అయితే మునిసిపల్‌ ముఖ్యులకు మాత్రం మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుండడంతో వారికి మాత్రం ఉపశమనం లభిస్తోంది. అయితే ఇతర అవసరాల కోసం నీటి లభ్యత ఉన్నప్పటికీ తాగునీరే కరువైంది. ఈ మేరకు పరిష్కా ర మార్గంగా కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పా టు చేసిన ఫ్రిజ్‌ అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. కార్యాలయ ప్రస్తుత భవనం ప్రారంభమైనప్ప టి నుంచి అనగా సుమారు మూడున్నరేళ్లుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. అయినప్పటికీ స్పందించాల్సిన యంత్రాంగంలో చలనం కరువైందని సందర్శకులతో పాటు సిబ్బంది వాపోతున్నారు. 

 రోజుకు సుమారు 250 మంది సందర్శకులు 

మునిసిపల్‌  కార్యాలయాన్ని రోజుకు సుమారు 250మందికి పైగా ప్రజలు సందర్శిస్తుంటారు. వీరి లో మునిసిపల్‌  ప్రజా ప్రతినిధులు, కార్యాలయ అధికారులు, సిబ్బంది, పనుల నిమిత్తం వచ్చే పౌరు లు, ఇతరులు  ఉంటారు. ఈ మేరకు రోజువారీగా కనీసం సుమారుగా 200 లీటర్ల తాగునీరు అవసరం ఉంటుంది. అయిలే మునిసిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో వేసిన బోరుబావి ద్వారా ఉప్పు నీరు ఉత్పత్తి అవుతుండడంతో ప్రజలు తాగలేకపోతున్నారు. పరిషాఆ్కర మార్గంగా ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్‌ ప్లాంట్‌ నిర్వహణ లోపంతో మూత పడింది. పట్టణ వాసులందరికీ కృష్ణా జలాలలను అందిస్తున్న పైపులైనను కార్యాలయం వరకు ఏర్పాటుచేయాలని   చేసిన ప్రతిపాదనలు మూలన పడ్డాయి. తాత్కాలికంగా  రోజువారీగా తాగునీటిని కొనుగోలు చేయాల ని సంకల్పించినప్పటికీ బిల్లుల చెల్లింపులో వచ్చి తారతమ్యాలతో  కొద్ది రోజులకే ట్యాంకర్‌ రావడం నిలిచిపోయింది. దీంతో పట్టణ వాసులందరికీ తాగునీటిని అందించడమే  తమ లక్ష్యమని పేర్కొనే ము నిసిపల్‌ యంత్రాంగానికే కార్యాలయంలో తాగేందు కు నీళ్లు లేని పరిస్థితులు నెలకొన్నాయి. 

 బొర్డే లేని కార్యాలయం 

నిబంధనల ప్రకారం ప్రతి దుకాణం, కార్యాలయం విధిగా బోర్డులు ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ సూచిస్తున్నప్పటికీ భువనగిరి మునిసిపల్‌ కార్యాలయానికి మాత్రం నేటికీ బోర్డు లేకపోవడం గమనార్హం.  ప్రతి కార్యాలయానికి బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందరికీ అర్థమయ్యే భాషల్లో, రాత్రి, పగలు కంటికి స్పష్టంగా కనిపించేలా కార్యాలయ ఫోన నెంబర్‌, చిరునామా, బోర్డును ఏర్పాటు  చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత భ వనంలో కార్యాలయం ప్రారంభమై సుమారు మూ డున్నరేళ్లు గడుస్తున్నా నేటికి బోర్డును ఏర్పాటు చేయడాన్ని మునిసిపల్‌ యంత్రాంగం విస్మరించింది. దీంతో పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు కార్యాలయ ఆచూకీని కనుక్కునేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. పైగా మునిసిపల్‌ కార్యాలయానికి బోర్డు లేకపోవడం, తాగేందుకు నీళ్లు దొరక్కపోవడంతో పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు.  ఇప్పటికైనా మునిసిపల్‌ కౌన్సిల్‌, అధికార యంత్రాంగం స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ బి.నాగిరెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. నీటి ఇబ్బందులను తీరుస్తామని పేర్కొన్నారు. 

 తాగునీరు అందుబాటులో ఉంచాలి

 పట్టణ  ప్రజల భాగోగులను పర్యవేక్షించే మునిసిపల్‌ కార్యాలయంలోనే తాగునీరు లేకపోవడం విచారకరం. పనుల నిమిత్తం కార్యాలయాని కి వస్తున్న పలువురు తాగునీటి కో సం అల్లాడుతున్నారు. వేసవిలో ఈ సమస్య మ రింత తీవ్రంగా వేధించింది. అలాగే కార్యాలయ చి రునామాను తెలిపే బోర్డు కూడా లేకపోవడం మునిసిపల్‌ యంత్రాంగం పని తీరును తెలియజేస్తున్నది. ఇప్పటికైనా కౌన్సిల్‌,అధికారులు స్పందించాలి. 

- జయప్రకాశరావు,సామాజిక కార్యకర్త, భువనగిరి.   


Updated Date - 2022-06-28T06:21:23+05:30 IST