కేబీ తిలక్‌పై గ్రంథావిష్కరణ

ABN , First Publish Date - 2020-09-23T06:23:35+05:30 IST

అనుపమ చలన చిత్ర దర్శక-నిర్మాత, అభ్యుదయ వాది, నిత్య క్రియాశీలి కొల్లిపర బాలగంగాధర తిలక్ చనిపోయి పది సంవ త్సరాలైంది...

కేబీ తిలక్‌పై గ్రంథావిష్కరణ

అనుపమ చలన చిత్ర దర్శక-నిర్మాత, అభ్యుదయ వాది, నిత్య క్రియాశీలి కొల్లిపర బాలగంగాధర తిలక్ చనిపోయి పది సంవ త్సరాలైంది. అన్ని రాజకీయ పార్టీల వారు తిలక్ తమవాడే అనడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. ఆయనపై ‘అభ్యుదయ దర్శకుడు కేబీ తిలక్‌ జ్ఞాపకాలు అనుభవాలు’ పేరిట వనం జ్వాలా నరసింహారావు రాసిన గంథ్రం ఆవిష్కరణ నేడు సాయంత్రం 7 గంటలకు జూమ్‌ అంతర్జాల వేదికపై జరు  గుతుంది. ‘అడుగుజాడలు’ ప్రచు రణ నిర్వహించే ఈ కార్యక్రమా నికి డాక్టర్‌ ఎస్‌. రఘు అధ్యక్షత వహిస్తారు. ప్రొ.ఘంటా చక్రపాణి ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. దేవులపల్లి అమర్‌ ఆత్మీయ అతిథిగా, తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్‌.నారాయణమూర్తి, టి.రాంమోహన్‌ రావు గౌరవ అతిథులుగా పాల్గొంటారు. ప్రసేన్‌, జూలూరు గౌరీశంకర్‌ ఆప్తవాక్యాలు పలుకుతారు. 

అడుగుజాడలు ప్రచురణ

Updated Date - 2020-09-23T06:23:35+05:30 IST