
లబ్బీపేట, జూన్ 25 : నేషనల్ క్లీనింగ్ ఎయిర్ ప్రోగ్రామ్‌లో భాగంగా శనివారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బందరు రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ దిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైకిల్ తొక్కారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, పలువురు కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.