ట్రంప్ 'గ్రీన్‌కార్డు' రూల్‌కు బైడెన్ చరమగీతం !

ABN , First Publish Date - 2021-03-11T01:45:59+05:30 IST

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమలు చేసిన మరో ఇమ్మిగ్రేషన్ రూల్‌కు చరమగీతం పాడే దిశగా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం అడుగేసింది.

ట్రంప్ 'గ్రీన్‌కార్డు' రూల్‌కు బైడెన్ చరమగీతం !

వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమలు చేసిన మరో ఇమ్మిగ్రేషన్ రూల్‌కు చరమగీతం పాడే దిశగా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం అడుగేసింది. వైద్య సహాయం, ఫుడ్​ స్టాంప్​, హౌసింగ్​ ఓచర్లు వంటి ప్రజా ప్రయోజనాలు పొందుతున్న వలసదారులకు అగ్రరాజ్యంలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే 'గ్రీన్​కార్డు' ఇవ్వకూడదనే​ ట్రంప్​ నిబంధనను మార్చేందుకు బైడెన్ పరిపాలన విభాగం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఆ దేశ సుప్రీంకోర్టుతో పాటు ఇతర న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరఫున ఉన్న వ్యాజ్యాలను మంగళవారం బైడెన్ సర్కార్ వెనక్కి తీసుకుంది.


కాగా, సొంతంగా బతకగలిగే వారు మాత్రమే అమెరికాకు రావాలనే ఉద్దేశంతో 2018లో ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చింది. అయితే, ఈ నిబంధన వల్ల అటు దేశ ప్రజలకు గానీ, ఇటు ప్రభుత్వానికి గానీ ఎలాంటి ప్రయోజనం లేదని ఈ సందర్భంగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. ఇక ఈ నిబంధనను సవాలు చేస్తూ అమెరికాలోని న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటికి వ్యతిరేకంగా ట్రంప్​ ప్రభుత్వం వ్యాజ్యాలు దాఖలు చేసింది. వీటినే బైడెన్​ యంత్రాంగం మంగళవారం ఉపసంహరించుకుంది. దీంతో ఈ నిబంధన మార్పునకు మార్గం సుగమమైంది.  

Updated Date - 2021-03-11T01:45:59+05:30 IST