ఉక్రెయిన్‌కు అదనపు మిలిటరీ సాయం: అమెరికా ప్రకటన

ABN , First Publish Date - 2022-04-22T02:16:39+05:30 IST

వాషింగ్టన్ : ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియుపోల్ నగరాన్ని నియంత్రణలోకి తీసుకున్నామనే రష్యా ప్రకటనపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు సందేహాలు వ్యక్తం చేశారు.

ఉక్రెయిన్‌కు అదనపు మిలిటరీ సాయం: అమెరికా ప్రకటన

వాషింగ్టన్: ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మారియుపోల్ నగరాన్ని నియంత్రణలోకి తీసుకున్నామనే రష్యా ప్రకటనపై అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ ప్రశ్న ప్రశ్నించదగ్గదని అన్నారు. రష్యాపై ఉక్రెయిన్‌ యుద్ధానికి మద్దతుగా 800 మిలియన్ డాలర్ల అదనపు సాయాన్ని జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక ప్యాకేజీలో అవసరమైన భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉక్రెయిన్ బలగాలకు అమెరికా అందజేయనుంది. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా-ఉక్రెయిన్ బలగాల మధ్య యుద్ధం ఉదృతమైన నేపథ్యంలో ఈ మేరకు సాయం అందించాలని అమెరికా నిర్ణయించింది. కాగా ఉక్రెయిన్ పోర్ట్ నగరం మారియుపోల్‌కు విజయవంతంగా విముక్తి కల్పించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-22T02:16:39+05:30 IST