బైడెన్ అధికారిక ట్విటర్ ఖాతాకు పొటెత్తిన ఫాలోవర్స్

ABN , First Publish Date - 2021-01-22T13:34:07+05:30 IST

అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ అధికారిక ట్విటర్ ఖాతా @POTUSకు ఫాలోవర్స్ పొటెత్తారు.

బైడెన్ అధికారిక ట్విటర్ ఖాతాకు పొటెత్తిన ఫాలోవర్స్

24 గంటల్లో 53 లక్షల మంది ఫాలోవర్స్

వాషింగ్టన్: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ అధికారిక ట్విటర్ ఖాతా @POTUSకు ఫాలోవర్స్ పొటెత్తారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 53 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. అంతకుముందు యూఎస్ ప్రభుత్వం తరఫున ట్రంప్‌కు కేటాయించిన ఈ ఖాతాను తాజాగా బైడెన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. బుధవారం ట్రాన్స్‌ఫర్‌కు ముందు ఈ ఖాతాకు 3.3 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్రంప్ ఖాతాకు ఉన్న వీరందరినీ తొలగించి జీరో చేశారు. అనంతరం బైడెన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయగా 24 గంటల్లోనే ఏకంగా 53 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ప్రస్తుతం ఈ అకౌంట్‌కు మొత్తం 56 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే 13 మందిని ఈ ఖాతా ఫాలో అవుతోంది. అటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు కేటాయించిన ఖాతాకు కూడా భారీ సంఖ్యలో ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇప్పటివరకు ఉపాధ్యక్షురాలి ఖాతాకు 74 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.  

   

Updated Date - 2021-01-22T13:34:07+05:30 IST