Biden-Putin సమావేశం!

ABN , First Publish Date - 2021-06-17T01:33:46+05:30 IST

రెండు దేశాలు అధికారికంగా స్నేహంగా ఉంటున్నట్లు కనిపిస్తాయి. కానీ, అమెరికాలో రష్యా రాయబారిగానీ, రష్యాలో అమెరికా రాయబారిగానీ లేరు. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి

Biden-Putin సమావేశం!

జెనీవా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం స్విట్జర్‌లాండ్ రాజధాని జెనీవాలో సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతలు ఐదు గంటల పాటు చర్చించనున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. అమెరికా, రష్యా సంబంధాలో అగాథం తీవ్ర స్థాయిలో పెరిగింది. తమ మధ్య సంబంధాలు ఎప్పుడో దెబ్బతిన్నాయని ఇరుదేశాలకు తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాలు సమావేశమైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. స్విట్జర్‌లాండ్ అధ్యక్షుడు గయ్ పర్మెలిన్ ఇరు దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు. మొదటగా రష్యా అధ్యక్షుడితో బైడెన్ కరచాలనం చేశారు. అనంతరం ఇరు దేశాల దౌత్యాధికారులతో బైడెన్, పుతిన్‌లు సమావేశమయ్యారు. ఈ బైడెన్ అధ్యక్షుడు అయ్యాక పుతిన్‌తో సమావేశం కావడం ఇదే తొలిసారి. సమావేశం సందర్భంగా పుతిన్ స్పందిస్తూ ‘‘ఈరోజు కలుసుకునేందుకు చొరవ చూపిన అధ్యక్షుడు బైడెన్‌కు ధన్యావాదాలు’’ అని పుతిన్ అన్నారు. కాగా ‘‘అమెరికా, రష్యా సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. వీటిపై అత్యున్నత సమావేశం అవసరం’’ అని బైడెన్ అన్నారు.


రెండు దేశాలు అధికారికంగా స్నేహంగా ఉంటున్నట్లు కనిపించినప్పటికీ అమెరికాలో రష్యా రాయబారిగానీ, రష్యాలో అమెరికా రాయబారిగానీ లేరు. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాష్యా జోక్యం చేసుకుందనే ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై అమెరికా ఆంక్షలు విధించింది. అలాగే అమెరికాకు చెందిన ఇద్దరు నౌకాదళ అధికారులు ఇప్పుడు రష్యా జైలులో ఉన్నారు. ఇక కొంత కాలం క్రితం పుతిన్‌ను కిల్లర్ అంటూ బైడెన్ అభివర్ణించారు. ఇది ఇరు దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచింది. ప్రస్తుత సమావేశంతో ఇరు దేశాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించకపోయినప్పటికీ ఆ వైపుగా జరిగే ప్రయత్నాలకు కొంత ఊరట లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Updated Date - 2021-06-17T01:33:46+05:30 IST