ఆ 26 దేశాలకు వెళ్లిన వారిపై.. అమెరికాలో షాకింగ్ నిర్ణయం!

ABN , First Publish Date - 2021-01-25T09:40:48+05:30 IST

టీవల అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జోబైడెన్.. షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారట. కొన్ని దేశాలకు వెళ్లిన నాన్-యూఎస్ పౌరులు ఎవరూ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించే యోచనలో ఉన్నారట. కరోనా

ఆ 26 దేశాలకు వెళ్లిన వారిపై.. అమెరికాలో షాకింగ్ నిర్ణయం!

వాషింగ్టన్: ఇటీవల అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జోబైడెన్.. షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారట. కొన్ని దేశాలకు వెళ్లిన నాన్-యూఎస్ పౌరులు ఎవరూ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించే యోచనలో ఉన్నారట. కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో యూరప్‌లోని యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, అలాగే బ్రెజిల్ తదితర దేశాలకు ఇటీవల కాలంలో వెళ్లిన వారు అమెరికాకు రాకుండా నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఈ దేశాలకు తమ ప్రజలు ఎవరూ వెళ్లొద్దని కోరుతోంది.


ఈ దేశాల నుంచి ఎవరైనా ఇతర దేశాల పౌరులు ఎవరూ అమెరికాలో ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకుంటుందట. అయితే ఈ దేశాలకు వెళ్లిన అమెరికన్ పౌరుల విషయంలో కొన్ని సడలింపులు ఉంటాయట. ఈ నిర్ణయాన్ని సోమవారమే వెల్లడిస్తారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ జాబితాలో తాజాగా సౌతాఫ్రికాను కూడా చేర్చినట్లు డాక్టర్ అన్నె షుచాట్ వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ భయంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. కరోనాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు బైడెన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత నుంచి పని చేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే దేశంలో మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-01-25T09:40:48+05:30 IST