ట్రంప్ చేసిన ఆ చట్టాన్ని తొలగించే యోచనలో బైడెన్.. అదేంటో తెలుసా?

ABN , First Publish Date - 2021-01-25T10:33:40+05:30 IST

ట్రంప్ హయాంలో అమెరికాలో చాలా అనవసర చట్టాలు చేశారని, వాటి వల్ల ప్రజల్లో అసమానతలు పెరిగాయని జోబైడెన్ ఎన్నోసార్లు విమర్శించారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన క్షణం నుంచి ట్రంప్ చేసిన చాలా చట్టాలను

ట్రంప్ చేసిన ఆ చట్టాన్ని తొలగించే యోచనలో బైడెన్.. అదేంటో తెలుసా?

వాషింగ్టన్: ట్రంప్ హయాంలో అమెరికాలో చాలా అనవసర చట్టాలు చేశారని, వాటి వల్ల ప్రజల్లో అసమానతలు పెరిగాయని జోబైడెన్ ఎన్నోసార్లు విమర్శించారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన క్షణం నుంచి ట్రంప్ చేసిన చాలా చట్టాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాన్స్‌జెండర్లపై ట్రంప్ చేసిన ఓ చట్టాన్ని తొలగించాలని బైడెన్ భావిస్తున్నారట. అదేంటంటే.. ట్రాన్స్‌జెండర్లు యూఎస్ మిలటరీలో చేరకుండా ట్రంప్ ఓ చట్టం తెచ్చారు. ఇదిగో ఈ చట్టాన్నే తొలగించాలని, ట్రాన్స్‌జెండర్లకు మిలటరీలో చేరే అవకాశం కల్పించాలని బైడెన్ డిసైడ్ అయినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.


ఈ నిర్ణయాన్ని సోమవారం ఉదయమే ప్రకటించినా ఆశ్చర్యం లేదని సదరు అధికారు చెప్పడం గమనార్హం. గతంలో బరాక్ ఒబామా హయాంలో ట్రాన్స్‌జెండర్లకు మిలటరీలో చేరే అవకాశం కల్పిస్తూ తొలిసారి చట్టం తెచ్చారు. ఆ తర్వాత వచ్చిన ట్రంప్ దీన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ బైడెన్ హయాంలో ట్రాన్స్‌జెండర్లకు మిలటరీలో చేరే అవకాశం లభించే ఛాన్స్ దొరుకుతుందన్నమాట.

Updated Date - 2021-01-25T10:33:40+05:30 IST