Airlines : విమాన టికెట్ రేట్లపై పరిమితులు ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-08-11T01:25:27+05:30 IST

విమాన టికెట్ రేట్ల(Ticket Fare) విషయంలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది.

Airlines : విమాన టికెట్ రేట్లపై పరిమితులు ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : విమానయాన(Aviation) రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం(Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా(corona) నేపథ్యంలో టికెట్ ధరలపై(Ticket Fares) విధించిన గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆగస్టు 31 తర్వాత విమానయాన సంస్థలే(Airlines) టికెట్ రేట్లను స్వచ్ఛంధంగా నిర్ణయించనున్నాయి. ఈ మేరకు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 21 మే 2022న టికెట్ రేట్లపై విధించిన అన్ని బ్యాండ్లపై గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను ఎత్తివేస్తున్నామని స్పష్టం చేసింది. దేశీయంగా విమానయాన కార్యకలాపాలు, విమానప్రయాణానికి ప్యాసింజర్ల డిమాండ్లు అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ నిర్ణయం ఆగస్టు 31, 2022 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా కొవిడ్ ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోమని, నిబంధనలను పకడ్బందీగా అమలుపరచాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. 


ఈ నిర్ణయంపై పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా స్పందించారు. విమాన ఇంధనం, డైలీ డిమాండ్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే టికెట్ ధరలపై పరిమితి ఎత్తివేయాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. విమానయాన రంగంలో స్థిరత్వం వచ్చిందని, భవిష్యత్‌లో వృద్ధి ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ నిర్ణయం విమాన ప్రయాణికులతోపాటు ఎయిర్‌లైన్స్‌కు కూడా ప్రయోజనకరమని ఏవియేషన్ నిపుణుడు పర్వీజ్ దమానియా చెప్పారు. టికెట్ రేట్లు తగ్గి ప్రయాణికులకు ఉపశమనం దక్కుతుందని సరిన్ అండ్ కో కంపెనీ కార్యకలాపాల హెడ్ వినమ్ర లొంగానీ ఆశాభావం వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-08-11T01:25:27+05:30 IST