‘మా‌’ ఎన్నికలు: ప్రకాశ్‌రాజ్‌ వర్సెస్‌ మంచు విష్ణు

Jun 21 2021 @ 19:10PM

తెలుగు చిత్రపరిశ్రమలో 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల పోరు ఈసారి రసవత్తరంగా ఉండబోతోందా? అంటే అవునని చెప్పకతప్పదు. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఈ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించగా.. తాజాగా మంచు విష్ణు కూడా ఈసారి 'మా' అధ్యక్ష పోటీలోకి దిగుతున్నట్లుగా ప్రకటించడంతో మరోసారి 'మా' ఎన్నికలపై ఆసక్తి క్రియేట్ అవుతోంది. కొత్త తరం, కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో మంచు విష్ణు 'మా' బరిలోకి దిగుతున్నట్లుగా అధికారికంగా తెలియజేశారు. అంతేకాదు ప్రకటనకు ముందే పక్కా ప్రణాళికతో విష్ణు అడుగులు వేస్తున్నట్లుగా ఆయన మూమెంట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. 

అదెలా అంటే.. తన తండ్రి మంచు మోహన్ బాబు ఆశీస్సులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా ఈసరికే విష్ణు సంప్రదించారట. సూపర్‌ స్టార్‌ కృష్ణను కలిసి మద్దతు కోరినట్లుగా ఓ ఫొటోని కూడా వారు విడుదల చేశారు. 'మా' సభ్యుల సంక్షేమం, 'మా' సొంత భవనం ఏర్పాటుకు కృషి... ఇవి  ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రకాశ్‌ రాజ్‌కి మెగాబ్రదర్‌ నాగబాబు సపోర్ట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

‘మా’ అధ్యక్ష బరిలో విలక్షణ నటుడు! ‘మా’ ఎన్నిక‌ల బ‌రిలోకి మంచు విష్ణు!మద్దతు కోసమా.. లేక మాములుగా కలిశారా?

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.