చిన్ని గుండెకు పెద్ద ఆపద

ABN , First Publish Date - 2022-01-29T05:25:14+05:30 IST

తమ కుమారుడిని ఆదుకోవాలంటూ పేద తల్లిదండ్రుల అభ్యర్థనకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

చిన్ని గుండెకు పెద్ద ఆపద
బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న యువజన నాయకుడు డాక్టర్‌ అజయ్‌

- మంత్రి కేటీఆర్‌ ఆదేశంతో ఆపరేషన్‌

- వెన్నంటి ఉన్న టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ అజయ్‌

అలంపూర్‌ చౌరస్తా, జనవరి 28 : తమ కుమారుడిని ఆదుకోవాలంటూ పేద తల్లిదండ్రుల అభ్యర్థనకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ అజయ్‌కి సమాచారం అందించి ఆదుకోవాలని సూచించారు. ఆయన వారి వెన్నంటి ఉండి ఆపరేషన్‌ చేయించి ఆదుకున్నారు. అయిజ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన గోవర్ధన్‌యాదవ్‌, ప్రశాంతి దంపతుల ఆరు నెలల కుమారుడు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతు న్నాడు. గుండెకు రంధ్రం వుందని, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. తమ కుమారుడిని ఆదుకోవాలని తల్లిదండ్రులు సోషల్‌ మీడియాలో దాతను అర్థించారు. ఈ విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు డాక్టర్‌ అజయ్‌కు సమాచారం ఇచ్చారు. ఆజయ్‌ కిష్టాపురం గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి మంత్రికి వివరాలు తెలిపారు. ఆయన ఆదేశం మేరకు బాలుడిని హైదరాబాద్‌లోని ఆపోలో ఆస్ప త్రిలో చేర్పించి ఆపరేషన్‌ చేయించారు. డాక్టర్‌ అజయ్‌ శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లి బాలుడి తల్లిదండ్రులను కలిసి మాట్లాడారు. అధైర్యపడొద్దని చెప్పి వారికి ఆర్థిక సాయం అందించారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో వారు మంత్రి కేటీఆర్‌కు, డాక్టర్‌ అజయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-01-29T05:25:14+05:30 IST