Amazon Primeలో సినిమాలు చూసేవాళ్లకు భారీ షాక్.. అతి త్వరలోనే..!

ABN , First Publish Date - 2021-10-21T21:00:17+05:30 IST

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం.. అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు చూసే వాళ్లకు భారీ షాకే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొందరు తమ మెంబర్‌షిప్‌ను వదలు

Amazon Primeలో సినిమాలు చూసేవాళ్లకు భారీ షాక్.. అతి త్వరలోనే..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం.. అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు చూసే వాళ్లకు భారీ షాకే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొందరు తమ మెంబర్‌షిప్‌ను వదలుకునే అవకాశాలు ఉన్నాయని.. ఒకవేళ అదే జరిగితే అమెజాన్‌కు నష్టం తప్పదని వాదిస్తున్నారు. కాగా.. అమెజాన్ తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏంటి అనే విషయంలోకి వెళితే..



ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ ధరల్ని పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కూడా తన వినియోగదారులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ ధరల్ని 50శాతం మేర పెంచనున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ప్రైమ్ ధర ఏడాదికి రూ.999 ఉండగా.. అదికాస్తా ఏకంగా రూ. 1,499కి చేరనున్నట్లు తెలిపింది. అదేవిధంగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.129కే అందుబాటులో ఉండగా.. అదికాస్తా రూ.50 పెరగనుంది. ఈ క్రమంలో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.179కి చేరనుంది. క్వార్టల్లీ సబ్‌ స్క్రిప్షన్‌ ధరను కూడా రూ.329 నుంచి రూ.459కి పెంచనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు.. వారి వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు ఉపయోగించుకోవచ్చనీ.. ఆ తర్వాత పెరిగిన ధరల ప్రకారం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని అమెజాన్ తెలిపింది. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయన్న విషయంపై స్పష్టత లేనప్పటికీ.. అమెజాన్ తీసుకున్న నిర్ణయంపట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే.. ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్ షాపింగ్ యాప్‌లో ప్రత్యేకమైన డీల్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. సేల్ సమయంలో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ఒకరోజు ముందుగానే ఆఫర్స్ పొందొచ్చు. ధరతో సంబంధం లేకుండా ఆర్డర్ ఫ్రీగా డెలివరీ అవుతుంది. ఉచితంగా ఇన్ గేమ్ కంటెంట్ సేవలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని ఈబుక్స్‌ను ఉచితంగా చదవొచ్చు. వీటితోపాటు అమెజాన్ ఓటీటీలో విడుదలైన ప్రతి సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.




Updated Date - 2021-10-21T21:00:17+05:30 IST